• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న 14 మంది, పుల్లల చెరువు ఎస్సైను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

September 21, 2024 / 08:07 PM IST

గిరిజన గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం: మందస మండలం గిరిజన గ్రామాలైన పాతకోట, బుడార్సింగి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి గూర్చి వివరించారు. అనంతరం వీధిలో పర్యటిస్తూ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

September 21, 2024 / 08:07 PM IST

పర్యాటక ప్రాంతంగా రాయల చెరువు కట్ట: ఎమ్మెల్యే నాని

TPT: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టపై చేపల వ్యాపారులకు రూములు ఏర్పాటుకు అధికారులతో శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే నాని స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాయలచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను కేటాయించడం జరుగుతుందని, ప్రతిపాదనలు ప్రారంభించినట్లు తెలిపారు.

September 21, 2024 / 08:04 PM IST

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డితో మాలేపాటి భేటీ

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం దగదర్తి మండల టీడీపీ నేత మాలేపాటి సుబ్బ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి సానుకూలంగా స్పందించారు.

September 21, 2024 / 08:04 PM IST

పొగిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ

SKLM: రాజాం మండలంలోని మేజర్ పంచాయతీ పొగిరి గ్రామంలోని చెక్‌పోస్ట్ వద్ద ఎస్సై మూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు, ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

September 21, 2024 / 08:03 PM IST

ఇందుకూరుపేటలో పౌష్టికాహార ప్రదర్శన కార్యక్రమం

NLR: ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరు పాలెం అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహార ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని లేదంటే పుట్టే పిల్లలు బలహీనంగా, అనారోగ్యంగా జన్మిస్తారన్నారు. కనుక మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనివ్వాలని తెలియజేశారు.

September 21, 2024 / 08:01 PM IST

నర్సింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: ప్రైవేటు నర్సింగ్ స్కూల్‌లో జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతిదేవి తెలిపారు. ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌లో పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రూ.500 డీడీతో దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ లోపు చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

September 21, 2024 / 07:59 PM IST

రేపు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

CTR: నెల్లుట్లవారిపల్లి పంచాయతీలోని సచివాలయంలో రేపు ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా MLA పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చిన్నగొట్టిగల్లు మండలం టీడీపీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి చిన్నగొట్టిగలు మండల పరిధిలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.

September 21, 2024 / 07:57 PM IST

డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

ప్రకాశం: మార్కాపురం డీఎస్పీ నాగరాజును రాష్ట్ర టీడీపీ పరిశీలకులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో కలసి అభినందనలు తెలియజేశారు. అనంతరం సబ్ డివిజన్లో పలు సమస్యలను ఆయనకు క్లుప్తంగా వివరించారు.

September 21, 2024 / 07:56 PM IST

వైష్ణవ ఆలయాలకు పొత్తెత్తిన భక్తులు ..!

TPT: పెరటాసి మాసం మొదటి శనివారం సందర్భంగా జిల్లాలోని పలు వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు పిండి దీపాలను పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామి వారు దేవేరులతో కలసి తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

September 21, 2024 / 07:41 PM IST

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులగుంట గ్రామ పంచాయితి వద్ద రేపు సాయంత్రం 3గంటలకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కావున మండలంలోని టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

September 21, 2024 / 07:39 PM IST

కొత్తపట్నం సముద్ర తీరంలో ‘స్వచ్ఛత ఈ సేవా‘

ప్రకాశం: కొత్తపట్నం సముద్రతీరంలో ‘స్వచ్ఛత ఈ సేవా‘ కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ ఆంధ్ర బెటాలియన్, స్పేస్ కాలేజ్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఉదయం కొత్తపట్నం సముద్ర తీరంలోని వ్యర్థాలను తొలగించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఎన్సీసీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

September 21, 2024 / 07:39 PM IST

‘సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం’

అన్నమయ్య: తీవ్ర సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంబేపల్లిలో జరిగిన ప్రజా వేదికలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు అందిస్తోందన్నారు. వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు.

September 21, 2024 / 07:39 PM IST

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు యోగ విద్యార్థులు

SKLM: మండలంలోని పొగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన యోగ విద్యార్థులు స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు 9 మంది విద్యార్థులకు బుధవారం నాడు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ ఎం సత్యరావు, పీడీ అజయ్ కుమార్, పీడీ సంతోషిమాత, యోగ ఉపాధ్యాయులు దుర్గా ప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోటీలకు ఎంపికైన విద్యార్థులకు నియోజవర్గం స్థాయి పాల్గొంటారని తెలిపారు.

September 21, 2024 / 07:34 PM IST

వైభవంగా గంధ మహోత్సవం

NLR: సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ఆస్థాన ఏ నూరియాలో హజరత్ ఆల్ హజ్ షేక్ షా భాషా నూరి సాహెబ్ ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త సొల్లల్లాహు అలైహి వసల్లెం వారి గంధమోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా మేళతాళాల నడుమ గ్రామంలో గ్రంధాన్ని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు.

September 21, 2024 / 07:34 PM IST