శ్రీకాకుళం: మందస మండలం గిరిజన గ్రామాలైన పాతకోట, బుడార్సింగి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి గూర్చి వివరించారు. అనంతరం వీధిలో పర్యటిస్తూ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.