కృష్ణా: కానూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కానూరులోని కామయ్యతోపు, మహాదేవపురం కాలనీ, సనత్ నగర్, 80 అడుగుల రోడ్డు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.