SRPT: హుజూర్ నగర్లోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబు కానున్నది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు అధ్యయనోత్సవాలు, 11వ తేదీ నుంచి వారం రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగనున్నాయి. వేడుకలను సాంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిపేందుకు సన్నాహాలు పూర్తి చేశామని ఈవో గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.