కృష్ణా: కంకిపాడు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.