NTR: యువతి అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రబాలెంకి చెందిన నిహారిక (25) ఎర్రబాలెం నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు ఫిబ్రవరి 5న వివాహ నిమిత్తం వచ్చింది. వివాహం అనంతరం ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించారు. భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.