ప్రకాశం: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారు రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా సూచించిన ప్రకారం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. అయితే గడువును పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.