ప్రకాశం: మార్కాపురం డీఎస్పీ నాగరాజును రాష్ట్ర టీడీపీ పరిశీలకులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో కలసి అభినందనలు తెలియజేశారు. అనంతరం సబ్ డివిజన్లో పలు సమస్యలను ఆయనకు క్లుప్తంగా వివరించారు.