PLD: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీహెచ్సీ. వైద్యాధికారి డాక్టర్ విద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈసీజీ రక్త పరీక్షలు, నిర్వహిస్తారని డాక్టర్ తెలిపారు.
కృష్ణా: దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆశా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పని భారం తగ్గించాలని కోరారు. పత్తికొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా, ఏఎన్ఎంలు, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి హనుమంతమ్మ, రంగస్వామి, శ్రీధర్ స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప.గో: కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలిపారు.
CTR: పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఉదయం 9.30 గంటలకు జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణా: విజయవాడ సత్యనారాయణపురంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణపురం సీఐ బాల రాజాజీ తెలిపారు. విజయవాడకు చెందిన హేమంత్ కుమార్ కుట్టి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడన్నారు. ద్విచక్ర వాహనాలు మాయమయ్యాయని పలు ఫిర్యాదులు రావడంతో నిఘా ఏర్పాటు చేసి ఇతనిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
W.G: తణుకు రూరల్ సీఐగా బర్రే కృష్ణకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కైకలూరు రూరల్ సీఐగా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన జీవీవీ నాగేశ్వరరావును వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తణుకు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
NLR: రూరల్ పరిధిలోని 32, 35, 41 డివిజన్ వైసీపీ కార్పొరేటర్లు శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అవినాశ్, వాసంతి, విజయలక్ష్మి, 35వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ శరత్ చంద్ర, 41వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ బార్జి చేరిన వారిలో ఉన్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాడు.
NLR: రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొండల రావు కుమార్తె తారక లక్ష్మి భవానికి MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చదువు నిమిత్తం రూ. 35 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థినికి ఉన్నత చదువులకోసం ఆర్థిక సహాయం చేశారు. ఆయనకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.
కృష్ణా: ఊటుకూరు శివారు నారాయణపురంలోని తోట చక్రవర్తికి చెందిన ఒంటి నెట్టాడు తాటాకిల్లు శనివారం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ దగ్ధమైంది. దీంతో రూ.3 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. చక్రవర్తి వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లగా ఆయన భార్య బంగారమ్మ మనవడుని అంగన్వాడీకి తీసుకువెళ్లింది. ఆసమయంలో విద్యుత్తు షార్ట్ సర్య్కూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ELR: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. శనివారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో నిందితులను ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
WG: భీమవరంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మకు పట్టణానికి చెందిన శ్రీనివాస రోహిత్ 6 గ్రాములు బంగారం, అచ్యుతరామరాజు 2 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి పాల్గొన్నారు.
WG: తిరుమల పవిత్రతను కాపాడాలంటూ భీమవరం పట్టణంలోని గునుపూడి గ్రామానికి చెందిన బ్రాహ్మణ సమైక్య నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకుపల్లి సంతోశ్ మాట్లాడుతూ.. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించే లాగా వ్యవహరిస్తున్నారని, పూర్తి విచారం చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
W.G: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయనను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ అహంకార ధోరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం నిడదవోలులో నిరసన చేపట్టారు. కాళ్ల మండలం ఏలూరుపాడులో అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీని ఎమ్మెల్యే చింపడంపై ఆయన ధ్వజమెత్తారు.
TPT: తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాల, బాలికల జూడో పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎస్.బాబు తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 24న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.