• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట

VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 9, 2025 / 12:27 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 8వ విడత సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం ఆర్ఎఫ్ విషయంలో ఉదారంగా స్పందిస్తున్న సీఎం చంద్రబాబుకు  కృతజ్ఞతలు తెలిపారు.

February 9, 2025 / 11:24 AM IST

‘ప్రజలకు ఉపయోగకరంగా వైద్య శిబిరాలు’

బాపట్ల: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. వేమూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్రామంలోని ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.

February 9, 2025 / 11:07 AM IST

ఊరకొండ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ప్రకాశం: పామూరు మండలంలోని ఊరకొండ వద్ద ఉన్న మట్టి కుప్పల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతను సుమారు 2, 3 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి 60 నుంచి 65 సంవత్సరాల వయసు ఉంటుంది. కనిగిరి గవర్నమెంట్ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు.

February 9, 2025 / 10:52 AM IST

‘ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

పల్నాడు: పెదకూరపాడులో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కెకె. చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

February 9, 2025 / 10:30 AM IST

13మద్యం షాపులకు 387 దరఖాస్తులు

E.G: జిల్లాలో కల్లు గీత కులాల వారికి కేటాయించిన 13 మద్యం షాపులకు శనివారం గడువు ముగిసే సమయానికి 387 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఆదివారం మద్యం షాపుల దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 12న రాజమండ్రి DRDO కార్యాలయం వద్ద మద్యం షాపులకు లాటరీ తీస్తామన్నారు. అనంతరం షాపులు కేటాయిస్తామన్నారు.

February 9, 2025 / 09:08 AM IST

ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్సు

గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు బయలుదేరుతుంది.

February 9, 2025 / 08:39 AM IST

ప్రముఖ గాయని కోటిరాజ్ మృతి

బాపట్ల: మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో సప్తస్వర సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు.

February 9, 2025 / 08:30 AM IST

తిరుపతమ్మ తిరునాళ్ల ఏర్పాట్ల పరిశీలన

NTR: ఈనెల 11నుంచి జరిగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించి చిత్రపటం అందజేశారు.

February 9, 2025 / 08:22 AM IST

గరుడ వాహనంపై శ్రీవారి ఊరేగింపు

E.G: కడియం మండలం దుళ్లలో గల శ్రీదేవి, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంబరాన్నంటాయి. శ్రీవారికి ప్రీతికరమైన గరుడ వాహనంపై దుళ్ల గ్రామ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు, ఉప సర్పంచ్ టి.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

February 9, 2025 / 08:09 AM IST

భక్తులతో సందడిగా మారిన శ్రీమఠం

KRNL: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో శనివారం సందడిగా మారింది.సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది తీరాలు భక్తులతో భరితమయ్యాయి. వారు పుణ్యస్నానాలు చేసి మంచాలమ్మను దర్శించి స్వామి బృందావనంలో పూజలు చేశారు.

February 9, 2025 / 07:51 AM IST

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు విద్యార్థినులు ఎంపిక

కృష్ణా: ముసునూరు మండలం రమణక్కపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్టు నుంచి ఎంపికైనట్లు పీడీ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రమణక్కపేట జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థినులు టి. నాగసుధ, డి. భార్గవిలు ఎంపికైనట్లు చెప్పారు. పిఠాపురంలో ఏపీ అండర్-16 రాష్ట్రస్థాయి యూత్ పోటీలు ఈనెల 11న జరుగుతున్నాయని అన్నారు.

February 9, 2025 / 07:37 AM IST

సీఐ అసభ్య ప్రవర్తన.. విచారణకు ఆదేశం

సత్యసాయి: మడకశిర సీఐ రాగిరి రామయ్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయత్రి అనే మహిళ జిల్లా SP రత్నకు ఫిర్యాదు చేశారు. బంధువులతో జరిగిన గొడవ విషయంలో స్టేషన్‌కు వెళ్లగా సీఐ తనను గదిలోకి పిలిపించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అంటూ అసభ్యంగా మాట్లాడారని వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.

February 9, 2025 / 07:30 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ పరికరాల ప్రారంభం

KRNL: పత్తికొండలోని మండగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. 1950లో ప్రారంభమై 75 సంవత్సరాల తర్వాత సిజేరియన్ కాన్పు పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వైద్యుల విజ్ఞప్తి మేరకు ఆయన ఏర్పాటు చేయించారు. అగ్రహారంకు చెందిన పద్మకు మొదటి సిజేరియన్ చేయగా సక్సెస్ అయ్యింది ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయాయని తెలిపారు.

February 9, 2025 / 07:24 AM IST

చిలకలడోనలో నిల్వ చేసిన గడ్డివాము దగ్ధం

KRNL: మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైంది. మాజీ MPTC డీపీ గోవిందమ్మ, రాఘవేంద్ర గ్రామ శివారులో పశుగ్రాసం నిల్వ చేసిన గడ్డివాములో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి, నీటిట్యాంకర్లు, JCB యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.1.5 లక్షల నష్టం జరిగిందన్నారు.

February 9, 2025 / 07:22 AM IST