ELR: కుక్కునూరు మండలం శ్రీధర్ గ్రామంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు భద్రాచలం రోటరీ క్లబ్ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. చిన్నపిల్లలు, ఎముకలు, దంతాలు , కంటి మహిళ వైద్య నిపుణులు సేవలందిస్తారని పేర్కొన్నారు.
ATP: కళ్యాణదుర్గంలో పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను జీరో చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి చెందిన నాలుగు ఎకరాల్లో 26 ఏళ్లుగా చెత్తను వేయడంతో టన్నుల కొద్ది పేరుకుపోయిందని తొలగింపు చర్యలు చేపట్టామనరు.
KRNL: అల్లినగరం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మహానందికి చెందిన వెంకటరమణ నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తన భార్యను చూసేందుకు బైక్ పై నంద్యాలకు వెళ్తుండగా అల్లినగరం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. తీవ్ర గాయాలైన అతణ్ని కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సత్యసాయి: జగన్ మెహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతువు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డిమాండ్ చేశారు. సోమందేపల్లి మండలంలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి భూ కబ్జాలు, అక్రమ ఇసుక, మైనింగ్‌తో ఇష్టారాజ్యంగా దోచుకున్నాడని మండిపడ్డారు.
SKLM: జలుమూరు మండలం బుడితి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా జలుమూరు మండలంలోని గ్రామాలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ వి. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తిమడాం, పర్లాం, మాకివలస, అచ్యుతాపురం, శ్రీముఖ లింగం గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 2 వీఆర్వోల బదిలీపై శనివారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా రెవిన్యూ అధికారి కొండయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులలో కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటనారాయణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను చిల్లకూరు గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించారు. రెండు వందల మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఆయా క్రీడలలో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ, పీడీ శిరీశ్ తెలిపారు.
సత్యసాయి: మడకశిర మండలం యు.రంగాపురం క్రాస్‌లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నియోజకవర్గ ఇంఛార్జ్ గుండుమల తిప్పేస్వామి సందర్శించారు. అక్కడికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో వారు పాల్గొని నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
WG: మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్ సచివాలయంలో పలువురు రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో కాళీపట్నం ఇనం ఎస్టేట్ భూములు సమస్యలు పరిష్కరించే దిశగా గ్రామంలోని పలువురు రైతుల నుంచి వారి అభిప్రాయాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా రైతులు ముందుకు రావాలని అన్నారు.
నెల్లూరు: నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకులానికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి తాగునీటి సరఫరాను శనివారం తిరిగి ప్రారంభించారు. ఆరేళ్ల కిందట మోటర్ కొట్టుకుపోయి పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దాత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నదిలో కొత్తగా బోరు వేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.
విజయనగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలపాలని శ్రేణులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. శనివారం విజయనగరం నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు.
GNTR: ది కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ తెనాలి ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని 22వ తేదీ నిర్వహిస్తామని ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు శనివారం తెలిపారు. తెనాలిలోని సొసైటీ ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని నేడు ఎన్జీవో కల్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు.
ప.గో: రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24న విడుదల చేయబడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.
WG: ప్రభుత్వ అనుమతులు లేకుండా మందు గుండు సామాగ్రి తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో మందు గుండు సామాగ్రి తయారు చేసే యూనిట్లను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.