KDP: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 ఆశయ సాధనలో భాగంగా కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో విజన్ ఆంధ్ర@2047 తీసుకురావడం జరిగిందన్నారు.
పశ్చిమ గోదావరి: జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ‘మన ఇల్లు- మన గౌరవం’ పేరిట ఈ నెల 28న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, ఈవోపీ ఆర్డీలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.
నంద్యాల: పట్టణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు రజినీ దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు స్కానింగ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కృష్ణా: విజయవాడ శివారు గొల్లపూడిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గొల్లపూడికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడకక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.
VSP: జీవీఎంసీ 14వ వార్డు బాలయ్య శాస్త్రి లే అవుట్ సమీపంలో జీవీఎంసీ అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19.50 లక్షలతో సీసీ కాలువ, రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
KRNL: పెద్దకడుబురులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎంపీడీవో జనార్దన్, ఎన్ఆర్జీఎస్ ఇంఛార్జ్ ఏపీవో, ఈసీ ఖాదర్ బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు పెంచి వాటిని సంరక్షించాలన్నారు. మానవ మనగడకు చెట్ల పెంపకం అవసరమని తెలిపారు.
ELR: టి.నరసాపురం మండలంలోని అల్లంచర్లరాజుపాలెంలో ఆదివారం నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొంటారని మండల అభివృద్ధి అధికారిణి మంగాకుమారి తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
KDP: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 100 రోజులలో పరిపాలన అద్భుతంగా చేస్తుందని జనసేన పార్టీ సమన్వయకర్త బసవి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఒకేరోజు అత్యధిక గ్రామసభలు నిర్వహించిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు దక్కుతుందని అన్నారు.
CTR: విజయవాడ వరద బాధితులకు బి.కొత్తకోట ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు రూ. లక్ష విరాళం అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. శనివారం రాత్రి అసోసియేషన్ సభ్యులు తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్ జయచంద్ర రెడ్డిని ములకలచెరువులోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రూ.లక్ష చెక్కును జయచంద్ర రెడ్డికి అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపాలని కోరారు.
SRKL: సారవకోట మండలంలో గత ఐదు రోజులు నుంచి జరుగుతున్న విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ముగిశాయి. స్థానిక విశ్వబ్రహ్మణ సంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ విగ్రహం దగ్గర నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి విగ్రహంను శోభయాత్ర నిర్వహించి స్థానిక కోనేరులో నిమజ్జనం చేశారు.
KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు సీఐ రాజగోపాల్ సూచించారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కూడళ్ల వద్ద శనివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేని వాటిని గుర్తించి ఫైన్ వేశారు. ప్రమాదాలు జరగకుండా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు.
విశాఖ: ప్రేమ పేరుతో యువతిని లొంగ తీసుకుని పెళ్లికి నిరాకరించి మోసం చేసిన వ్యక్తిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. తాటిచెట్ల పాలెంకు చెందిన యువతిని భీమిలికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 2017 నుంచి ప్రేమిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె కోరడంతో నిరాకరించినట్లు పేర్కొన్నారు.
కృష్ణా: అనుమతులు లేకుండా ఎవరైనా దీపావళి మందుగుండు సామాగ్రి కలిగి ఉన్నా, తయారీ, రవాణా చేస్తుంటే నేరంగా పరిగణిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తెలిపారు. లైసెన్సు లేకుండా ఎవరైనా క్రాకర్స్ విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ఈ మేరకు కృష్ణా జిల్లా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: వంద రోజులు పాలనలో సీఎం చంద్రబాబు ఎవరికీ మంచి చేయకపోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎక్కడా కనిపించడం లేదన్నారు.పైగా తనది మంచి ప్రభుత్వం అంటూ గ్రామ సచివాలయ సిబ్బందిని ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించమంటున్నారని ఎద్దేవా చేశారు.
అల్లూరి: 4 మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు ఉ. 10 గం నుంచి మ. 2 గం. వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ముంచింగిపుట్టు-పెదగూడ, బాకుల పుట్టు, చుట్టమూరుపుట్టు, కొండపాడులలో, చింతపల్లి-లోతుగడ్డ, చిన్నగడ్డ వంగసారలలో, కొయ్యూరు పరిధి కాకరపాడు, సింగవరం, రాజేంద్రపాలెంలలో, అనంతగిరి-భీమవరలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.