ATP: గుత్తి పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుత్తి ఆర్ఎస్, జెండా వీధిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం: ముథోల్‌లో కవి, రచయిత జాదవ్ పుండలిక్ రావు రూపొందించిన మధురవాణిలో రెడ్ల బాలాజీ శతక కవితలు రాసినందుకు ఆయనకు వాణిశ్రీ పురస్కారం ప్రకటించారు. ఆ సందర్భంగా తపాలా ఉద్యోగులు ఎస్పీఎం గంగయ్య బాలాజీని ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బాలాజీ రాసిన మధురవాణితో పాటు చిత్ర మధురవాణి, చరిత్ర, గీతశక్తి, వసుధవాణిలో శతక కవితలు రాసి పలువురి కవుల మెప్పు పొందారని అన్నారు.
CNT: నిండ్ర మండలం ఎలకాటూరు గ్రామంలో నేడు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం శనివారం తెలిపింది. ఉదయం 11.15 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
BPT: రేపల్లె 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా అదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రేపల్లె పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం పంచాయతీలో నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే సందర్భంగా శనివారం స్వచ్ఛసాగర్- సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్ టాయ్స్ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, బీచ్ ఇంఛార్జ్ ఆచార్యుల ఆధ్వర్యంలో బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్, పర్యావరణ హానికరమైన ఇతర వ్యర్ధాలను తరలించారు.
అల్లూరి: జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శనివారం తెలిపారు. రెండు రోజులు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 3 గంటలు నుండి రాత్రి ఆలయం మూసివేసే వరకూ రూ.30,01,121 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కిషోర్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సిబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
విజయనగరం: లోన్ యాప్‌ల జోలికి వెళ్లవద్దని జగ్గయ్యపేట గ్రామస్థులను వేపాడ ఎస్ఐ బి. దేవి శనివారం హెచ్చరించారు. చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి లోన్‌యాప్ దురాగతాలకు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు, విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో అదివారం శంకుస్థాపన కార్యక్రమం చేయనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం: సచివాలయం ANMలపై పని ఒత్తిడి తగ్గించాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వి.ఇందిర డిమాండ్ చేసారు. ఏఎన్ఎం యూనియన్ నాయకులుతో కలిసి శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయపార్వతికి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు సచివాలయంలో పనులు చేస్తూ, వైద్య శాఖ పనులు చెయ్యడం వలన ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.
KRNL: నందవరం మండల కేంద్రంలో స్థానిక దేశాయ్ నెట్వర్క్ కార్యాలయంలో టీడీపీ మండల నాయకులు దేశాయ్ గురు రాజారావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు.
CTR: చిత్తూరు-తచ్చూరు నేషనల్ హైవే రైతుల నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొంటారని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల కార్యదర్శులు నాగరాజన్, మురళీ తెలిపారు. నగరి సమీపంలోని ఐనంబాకం వద్ద ఉన్న పాదిరి గ్రామం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల నుంచి వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కాకినాడ: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అభ్యర్థులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్సులతో రావాలన్నారు.
నెల్లూరు: గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న బోరుకు మరమ్మతులు చేపట్టారు. వాటితోపాటు అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్య పనులను కూడా పంచాయతీ సిబ్బంది చేపట్టారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలతో పంచాయతీ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నట్లు టీడీపీ నేత శ్రావణి రెడ్డి తెలిపారు.
EG: రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం రాత్రి 1.60 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందన్నారు.