PLD: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాల పాలైన సంఘటన మాచర్ల పట్టణ పరిధిలోని నాగార్జునసాగర్ హైవే వద్ద ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం రాత్రి జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: శ్రీకాకుళం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ జి పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి పరమ్ జ్యోతి, శ్రీకాకుళం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గరికపాడు పాల్గొన్నారు. ముస్లింలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పలు సమస్యలు, సంస్థాగత కార్యచరణ అంశాలపై మాట్లాడారు.
KKD: కరప మండలం గొర్రిపూడికి చెందిన రామారావు (68) అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై సూరిబాబు శనివారం తెలిపారు. సైకిల్‌పై తిరుగుతూ బట్టలు విక్రయించే రామారావు 20 రోజుల క్రితం వ్యాపారంలో భాగంగా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సైకి తెలిపారు.
కాకినాడ: పరీక్ష రాసేందుకు విజయవాడ నుంచి విశాఖకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన గంటకే ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కడుపుకోత మిగిలింది. కాకినాడ జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారిపై తుని మండలం ఎర్రకోనేరువద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీబీఏ విద్యార్థులు మృతి చెందారు.
తూ.గో: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబరు 23వ తేదీన యధావిధిగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, అర్జీలని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్, మున్సిపల్, మండల అధికారులకి అందజేయాలన్నారు.
కోనసీమ: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద కల్తీ నీచమైన పని అంటూ ఆలమూరు మండలం చెముడులంక విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన తెలిపారు. జగన్ చిత్రపటాన్ని దహనం చేశారు. లడ్డూ నాణ్యతపై ఎప్పటి నుంచో వివాదం జరుగుతుందని కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
BPT: బాపట్లలో శనివారం రాత్రి ఓ ఆటోను కారు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాత్రి బాపట్ల సూర్యలంక రహదారిలో వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిందన్నారు. ఆటోను ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఆ కారును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TPT: చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో కారులోని ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో మృతి చెందారు. గాయపడ్డ మరికొంతమందిని వైద్య చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: SGFI రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సింగరాయకొండ మండలంలోని పాకల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు, ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీ.వీఎస్ ప్రసాద్ శనివారం తెలిపారు. జిల్లాస్ధాయి జూడో ఎంపిక కార్యక్రమంలో అండర్-14 విభాగంలో జూడోలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.
తూ.గో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ ఆన్‌లైన్ ఇసుక నిర్వహణ వ్యవస్థ పై తహశీల్దార్లు పూర్తి అవగాహన పెంపొందించుకుని మండల స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శనివారం ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్‌లైన్ పోర్టల్ వినియోగంపై అమలాపురం కలెక్టరేట్‌లో తహశీల్దార్లకు, రవాణా ఏజెన్సీలకు అవగాహన కల్పించ...
ప్రకాశం: నాగులుప్పలపాడు మండలంలోని నిడమానూరు ఉన్నత పాఠశాలను జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారిణి ప్రమోద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి వృత్తి విద్యా కోర్సుల బోధనకు ప్రభుత్వం అందించిన సామగ్రిని సద్వినియోగం చేయాలన్నారు.
ATP: గుంతకల్లు పట్టణ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను శనివారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై రాఘవేంద్ర మాట్లాడుతూ.. పామిడి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గుంతకల్‌కు ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశామని తెలిపారు.
GNTR: రొంపిచర్ల మండలంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి పనుల్లో సుమారు రూ.3 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వెల్లడించాయి. మరో రూ.6 లక్షల ఉపాధి నిధులు వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. రూ.9.25 కోట్లతో చేపట్టిన 602 పనులకు, సంబంధించి సోషల్ ఆడిట్ బృందాలు గ్రామాల్లో తనిఖీలు చేశారు.
విజయనగరం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కిచ్చాడ గ్రామంలో 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికీ వెళ్లి తెలియజేశారు. అనంతరం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, టీడీపీ నాయకులు సుకేష్ చంద్రపండ, కర్రీ శ్రీనివాసరావు ,ఆకుల రమేష్ పాల్గొన్నారు.
కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం రామచంద్రపురంలోని కంతేటి పేర్రాజు క్రీడా ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు 2011 జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టిన వారి అర్హులని తెలిపారు.