VSP: పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తున్నట్లు 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చేపట్టిన రహదారి పనులను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంక్రీట్ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
ఎన్టీఆర్: తిరువూరు పట్టణ పరిధిలోని రాఘవ ఎస్టేట్ ఏరియాలో ఓ వ్యక్తి అధికారుల కళ్లుగప్పి అక్రమ రేషన్ బియ్యం తరలించారు. శనివారం స్థానికులు మిల్లులో రేషన్ బియ్యం లోడింగ్ అవుతుండగా వీడియో, ఫొటోలు తీసి సమాచారం అందించారు. ఇప్పటి వరకు అక్రమ రేషన్ వ్యాపారం చేస్తున్న వ్యక్తిపై ఒక్క కేసు కూడా లేకపోవడం పలు అనుమానాలు గురి చేస్తుందని స్థానికులు వాపోయారు.
KDP: విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం పులివెందుల వైసీపీ నాయకులు సేకరించిన నిత్యావసర సరుకులను శనివారం సాయంత్రం పంపిణీ చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షులు, ఓతూరు రసూల్ విజయవాడలోని పాయకపురం, జక్కంపూడి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ATP: గుత్తి చెరువు నీటితో కళకళలాడుతుంది. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షానికి వర్షపు వరద నీరు చెరువులోకి భారీగా చేరాయి. దీంతో చెరువు నీటితో కళకళలాడుతుంది. మరోపక్క గత వారం రోజుల క్రితం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హంద్రీనీవా కాల్వ ద్వారా కృష్ణ జలాలను విడుదల చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లకు గండ్లు పడ్డాయి. దీంతో అధికారులు రోడ్డ మరమ్మతులకు చర్యలు చేపట్టారు. గొట్టుముక్కల నుంచి అడవికి వెళ్లే కట్టెల రోడ్డు ఏనుగు గడ్డ వాగు వరద వలన సుమారు మూడు కిలోమీటర్ల దూరం గండ్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లా: వత్సవాయి మండలం పెంట్యాలవారిగూడెంలోని రెడ్డిచెరువు వేలం లీజు పాటను ఈనెల 24న నిర్వహించనున్నారు. వేలంపాటను గ్రామపంచాయితీ కార్యాలయంలో నిర్వహిస్తామని పెంట్యాలవారిగూడెం సర్పంచ్ పరమయ్య ప్రటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.లక్ష డిపాజిట్ చెల్లించాలని, మూడేళ్లలీజుకు సంబంధించి హెచ్చు పాటదారుగా నిలిచినవారు ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించాలని తెలిపారు.
కృష్ణా: మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ముసునూరు మండలంలో పర్యటించనున్నారు. ముసునూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి చేతుల మీదుగా అధికారులు శంకుస్థాపన చేయనున్నారు. వలసపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఆదివారం ప్రీతికరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పొంగల్లు పెట్టారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జనార్ధన్ రావు అనే వ్యక్తి స్నానానికి వెళ్లి వచ్చేలోగా తన ఉంగరాలు చోరీకి గురి అయ్యాయ్యని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివరాల ప్రకారం ఈనెల 17న జనార్ధన్ తన వేళ్లకు ఉన్న 2 ఉంగరాలు తీసి సోపాలో పెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఉంగరాలు కనిపించడం లేదని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తూ.గో: కంటైనర్‌లో ఎద్దులను తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ శనివారం తెలిపారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి జంక్షన్‌లో అక్రమంగా తరలిస్తున్న 44 ఎద్దులను, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని విజయనగరం నుంచి చిలకలూరిపేటకు తరలిస్తున్నట్లు తెలిపారు. కంటైనర్‌ను సీజ్ చేశామని తెలిపారు.
ప్రకాశం: చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శనివారం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. హుటాహుటిన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్కూల్‌లో దాదాపు 540 మంది విద్యార్థులు ఉన్నా ఏఎన్ఎం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వారికి వైద్య సేవలు అందడం లేదని, ప్రాణాల మీదకు వచ్చినా పట్టించుకునే వారు లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్...
కోనసీమ: అమలాపురంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ అపవిత్రమైన ఘటనకు కారణమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్ సంఘాల నాయకులు శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
కృష్ణా జిల్లా: ఈనెల 24 నుంచి రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీని కానూరులోని అనుమోలు ప్రభాకర్ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.శేషగిరిరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 24 నుంచి 26 వరకు ఈ పోటీలు జరుగుతాయని, రాష్ట్రంలోని 12 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు.
విజయనగరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పూర్తయిన సందర్బంగా నియోజవర్గంలో ఇంటింటి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తవలస మండలం అప్పన్నపాలెం ఉదయం 9 గంటలకు, ఉత్తరాపల్లి గ్రామంలో 10.30 ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రెండు కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపారు.
PLD: ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరేలా గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో రూ.70కోట్లతో CC, BT రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.60కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 700 మినీ గోకులాల ఏర్పాటులో భాగంగా 550 మంజూరు చేసామన్నారు.