• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో 17వ రోజుకు చేరిన నర్సుల నిరసన

GNTR: కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే వరకూ తమ పోరాటం ఆగదని జీజీహెచ్ కాంట్రాక్టు నర్సులు స్పష్టం చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో వారు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారంతో 17వ రోజుకు చేరింది. ఆదివారం అయినప్పటికీ పట్టువదలకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం నర్సింగ్ ఉద్యోగులు తమ గళం విప్పారు.

September 22, 2024 / 10:08 AM IST

VIDEO: వరద నీటిలోనే అమ్మవారి ఆలయం

తూ.గో: దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం ఇంకా వరద నీటిలోనే ఉందని, భక్తులెవరూ దర్శనాలకు రావద్దని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. ఆదివారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరి వరద ఉద్ధృతంగా ఉందని, అమ్మవారి ఆలయం చుట్టూ వరద నీరు ఉందని తెలిపారు. ఆలయంలోకి వెళ్లడానికి మార్గం లేదని పేర్కొన్నారు.

September 22, 2024 / 10:08 AM IST

మీలాద్ ఉన్ నబీ ఘటనపై ముస్లిం పెద్దల వివరణ

కృష్ణా జిల్లా: ఈనెల 16వ తేదీన మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా పెడనలో గొడవకు సంబంధించి ముస్లిం మత పెద్దలు షాదీ ఖానాలో వివరణ ఇచ్చారు. పండగ సందర్బంగా తోరణాలు కట్టుకునే తరుణంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అయితే ఇప్పటివరకు పెడనలో అందరం సహోదర భావంతో జీవించామని అన్నారు. ఎటువంటి వివాదాలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పచెప్తామన్నారు.

September 22, 2024 / 10:08 AM IST

రెండు రోజుల పాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు (GNT)- విశాఖపట్నం (VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను 2 రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. GNT-VSKP మధ్య ప్రయాణించే రైలు(17239)ను ఈ నెల 29,30 తేదీల్లో.. VSKP-GNT రైలు(12740)ను ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

September 22, 2024 / 10:06 AM IST

26వ తేదీలోపు 4వ విడత ఐటీఐ కౌన్సెలింగ్

NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో భర్తీ కాని సీట్లలో ప్రవేశాలకు నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ కె. శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 26 వ తేదీలోపు దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.

September 22, 2024 / 10:05 AM IST

మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రేసులో మాజీ జడ్పీటీసీ

కృష్ణా జిల్లా: నందిగామలో మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవికి కొందరు పేర్లు పార్టీ అధిష్ఠానం ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే అందరికంటే ముందు వరుసలో మాజీ జడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్ పేరు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నాయకులు చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నాయకుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

September 22, 2024 / 10:05 AM IST

వినాయకుని నిమజ్జనంలో పవన్, ఎన్టీఆర్, సౌమ్య ఫొటోలు

కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంం కొనతాలపల్లి గ్రామంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు డిప్యూటీ సీఎం పవన్, హీరో ఎన్టీఆర్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫొటోలను ప్రదర్శించారు. అనంతరం డీజెలు, డాన్సులతో పురవీధుల్లో గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు.

September 22, 2024 / 10:05 AM IST

అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కనపర్తి

కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్య దర్శి కనపర్తి శ్రీనివాసరావుని పార్టీ అధిష్ఠానం నియమించింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. గతంలో పార్టీకి ఇంఛార్జ్ బాధ్యతలు వహించిన బుద్ధప్రసాద్ జనసేనలో చేరి ఎమ్మెల్యే కావటంతో టీడీపీ ఇంఛార్జ్‌ను ప్రకటించలేదు.

September 22, 2024 / 10:04 AM IST

పంట పొలాలకు నీరు విడుదల చేయాలి

కృష్ణా జిల్లా: ఇటీవల కృష్ణా వరదలు, అధిక వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలు నేడు సాగునీరు అందక నెరలిస్తున్నాయి. మోపిదేవి మండలంలోని పెద్దకళ్లేపల్లి పంచాయతీ పరిధిలో సాగునీరు అందక వరి పంటలు నెరలిచ్చాయి. 11/1 నుంచి 11/4 బ్రాంచ్ కాలువల ద్వారా భూములకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ కాలంలో నుంచి నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.

September 22, 2024 / 10:02 AM IST

భారీగా పెరిగిన కొబ్బరి ధర.. రైతుల్లో ఆనందం

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా కొబ్బరి ధర భారీగా పెరిగింది. ఒక్కొక్క కొబ్బరికాయ రూ.10లు ఉండే ధర రూ.14.50 పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పండుగ విజయదశమి కావడంతో ఈ ధర వచ్చిందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. భారీగా ఎగుమతులు కొనసాగడంతో వ్యాపారస్తులు కొబ్బరికాయ కొనేందుకు పోటీ పడుతున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

September 22, 2024 / 10:01 AM IST

నంద్యాలలో జమ్మలమడుగు వ్యక్తి మృతి

నంద్యాల: కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రైలు ఢీకొని ఓ వృద్ధుడు చనిపోయిన విషయం తెలిసిందే. మృతుడు కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన దండే సూర్యనారాయణ (60)గా గుర్తించారు. సౌదరదిన్నెలో బంధువుల ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రైలు కిందపడి చనిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 22, 2024 / 10:00 AM IST

కార్యాలయ పనులను పునం: ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు: బుచ్చి పట్టణంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించారు. నగర పంచాయతీ కార్యాలయం పనులను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో నగర పంచాయతీ కార్యాలయం అసంపూర్తిగా మిగిలింది అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పనులను పునం: ప్రారంభించామని తెలిపారు. ఆరు నెలల్లో నగర పంచాయతీ కార్యాలయం పూర్తి చేస్తామని వెల్లడించారు.

September 22, 2024 / 09:54 AM IST

అక్రమంగా మట్టీ తరలింపు

SRKL: సరుబుజ్జిలి మండలం దంతావరపు కోట నుంచి అక్రమంగా సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలలో మట్టిని తరలిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా అక్రమంగా మట్టిని తెచ్చి ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ విలువ రూ.1500 వరకు ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా గుత్తేదారులు వేల సంఖ్యలో సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

September 22, 2024 / 09:54 AM IST

చినగంజాంలో రోడ్డు ప్రమదం.. ఒకరికి తీవ్ర గాయాలు

ప్రకాశం: చిన్నగంజాం మండలం జీడిచెట్లపాలెం హైవే వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసుల వివరాల ప్రకారం.. జీడిచెట్లపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన హైవే పోలీసులు, హైవే అంబులెన్స్‌లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 22, 2024 / 09:51 AM IST

వింజనంపాడులో అందుబాటులోకి శుద్ధజలాలు

ప్రకాశం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శుద్ధజల పథకం సేవలు గ్రామస్థులకు చేరువయ్యాయి. యద్దనపూడి మండలం వింజనంపాడులో కొద్ది రోజులగా నిలిచిపోయిన పథకం నిర్వహణ ఉప సర్పంచి సాదినేని రంగారావు నేతృత్వంలో ప్రారంభించారు. సుమారు రూ. లక్ష నిర్వహణ వ్యయాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో దీనిని ప్రారంభించారు.

September 22, 2024 / 09:50 AM IST