KDP: కదిరి వ్యవసాయ పరిశోధనా సంస్థ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి (86) ఆదివారం తెల్లవారుజామున ప్రొద్దుటూరులో మృతి చెందారు. తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వేరుశనగలో రెండు రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆ బృందానికి నాయకత్వం వహించారు.
BPT: ఇటీవల వరదల కారణంగా పంట దెబ్బతిన్న రైతులు వెంటనే పంట నష్టాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. పంట నష్టం నమోదు ఆదివారం చివరి రోజు కావడంతో రైతులు వేమూరు నియోజకవర్గంలోని మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్, క్షేత్ర సహాయకులను సంప్రదించి వెంటనే పంట నష్టం నమోదు చేయించుకోవాలన్నారు.
KKD: పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గామాత దేవి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రత్తిపాడు పార్టీ కార్యాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
KRNL: జిల్లాకు విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును స్టెట్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో హంద్రీ నీవా ద్వారా చెరువులకు నీళ్ళు నింపాలని, అలాగే అలగనూరు రిజర్వాయరు మరమ్మత్తులు, గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
తూ.గో: కొయ్యలగూడెం మండలానికి చెందిన వెంకట్రావు (60) మృతదేహం కొవ్వూరు టౌన్ పరిధిలోని భక్తాంజనేయ స్నాన ఘట్టం వద్ద శనివారం లభ్యమయిందని టౌన్ ఎస్సై జగన్మోహన్ శనివారం తెలిపారు. మృతుడు ఈనెల 20న వైద్యం కోసం రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు రాంబాబు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.
ATP: గుత్తి మండలం అబ్బేదొడ్డిలో భార్యపై భర్త దాడి చేశాడు. గ్రామానికి చెందిన సుమలత, ఆమె భర్త గోపాల్ మధ్య శనివారం రాత్రి చిన్నపాటి విషయంపై గొడవ ప్రారంభమైంది. కోపంతో గోపాల్ భార్యపై దాడి చేశాడు. స్థానికులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
KKD: రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్ద వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3 లక్షల రూపాయలు చెక్‌ను మహమ్మద్ కాజ ముహుద్దీన్‌కు ఎమ్మెల్యే అందజేశారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు.
ప్రకాశం: మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా గుర్తించారు. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కతజ్ఞతలు తెలి...
శ్రీకాకుళం: ఆమదాలవలస ప్రధాన రహదారిలో వాకలవలస వద్ద ఆటో ముందు చక్రం రహదారి గోతిలో దిగి విరిగి పోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ముందు చక్రం విరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఐతే ఆటో బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. రహదారి సరిగా లేకనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
NDL: విజయవాడలో అక్టోబర్ 27 నుంచి 30వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని నంద్యాల జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో వస్తున్న మార్పులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు అందరూ తరలి రావాలని కోరారు.
GNTR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరగడాన్ని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ఆదివారం ప్రదర్శన చేపట్టారు. వెంకటేశ్వరస్వామి విగ్రహంతో పూజలు జరిపి నిరసన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని అందించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్వామీజీలు ధ్వజమెత్తారు.
KKD: అక్రమ డీజిల్ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామం సమీపంలో ఆదివారం యానం నుంచి ఆక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్‌ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ట్యాంకర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 24, 25 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు అండర్-14,17 విభాగాలలో గూడూరు జడ్పీ పాఠశాలలో అథ్లెటిక్స్, గేమ్స్ పోటీలు నిర్వహిస్తామని పాఠశాల హెచ్ఎం డి.పుష్పలత తెలిపారు. 24న బాలురకు, 25న బాలికలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు గూడూరు జడ్పీ పాఠశాలలో సంప్రదించాలన్నారు.
కృష్ణా జిల్లా: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగాయలంక మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 23, 24 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు అండర్-14,17 విభాగాలలో నాగాయలంక జడ్పీ పాఠశాలలో అథ్లెటిక్స్, గేమ్స్ పోటీలు నిర్వహిస్తామని మండల స్పోర్ట్స్ కన్వీనర్ కె.పూర్ణచంద్రరావు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు జడ్పీ పాఠశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు.
గుంటూరు: నంబూరులో గల దశవతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు.11 రోజుల పాటు పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైందన్నారు.