కాకినాడ: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బంకమట్టితో శివలింగాల తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. తుని పట్టణంలోనే బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో వ్యాపారవేత్త చెక్కా తాతబాబు, మాజీ ఛైర్ పర్సన్ శోభారాణి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. కోటి శివలింగాల తయారీ కార్యక్రమంలో భాగంగా 15 రోజులులో 5 లక్షలు శివలింగాలు తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
SRKL: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం డోలపేట గ్రామంలో ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిసరాలను NSS స్టూడెంట్స్, గ్రామస్తులు కలిసి పరిశుభ్రం చేశారు. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్య్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు అని వారు అన్నారు.
SRKL: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఈరోజు ఉదయం తోపులాట చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌కు సిబ్బందికి మధ్యలో జరిగిన లావాదేవీలు వివాదాస్పదంగా మారాయి. దీంతో టోల్గేట్ సిబ్బంది లారీ డ్రైవర్‌పై జూలుం ప్రదర్శించారు. దీంతో లారీ డ్రైవర్లు వాహనాలను టోల్గేట్ పైనే నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 23 మంది మున్సిపల్ కమిషనర్లను శనివారం బదిలీ చేస్తూ పురపాలక శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల జారీ చేశారు. దీనిలో భాగంగా అద్దంకి మండలం, అద్దంకి మున్సిపల్ కమిషనర్‌గా డి. రవీంద్రను నియమించినట్లు పురపాలక శాఖ వెలువరించిన ఉత్తర్వులలో (GORT 723)లో పేర్కొనడం జరిగింది.
ELR: ఏలూరు జిల్లాలో పెదవేగిలో అత్యధికంగా 40.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, లింగపాలెంలో 1.2 మిల్లిమీటర్ల అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం 37.2, ఉంగుటూరు 23.0, కొయ్యలగూడెం 17.4, ద్వారకాతిరుమల 16.2, జంగారెడ్డిగూడెం 13.6, భీమడోలు 10.8, పోలవరం 9.0, ముసునూరు 8.6, ఏలూరు రూరల్ 8.2, ఏలూరు అర్బన్ 8.0, నూజివీడు 7.2, పెదపాడు 6.6 నమోదయిందని తెలిపారు.
SRKL: పొందూరు మండలంలోని తోలాపి గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి స్టిక్కర్ అంటించారు. పింఛన్ రూ. వెయ్యి పెంపు, రూ.5 కే అన్న క్యాంటీన్ భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి మంచి పథకాలు అందిస్తున్న మన ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించారు.
GNTR: ‘స్వచ్ఛతా హీ’ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం గుంటూరు నగరంలో సైక్లోథాన్ జరిగింది. కలెక్టర్ నాగలక్ష్మీ అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ సతీశ్ కుమార్, జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెరేడ్ గ్రౌండ్స్ నుంచి నగరంపాలెం, హిందూ కాలేజ్, కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, మీదుగా ర్యాలీ గ్రౌండ్‌కు చేరింది.
SKLM: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బాబా నగర్, ఈశ్వర్ నారాయణ, తదితర కాలనీలలో ఆదివారం ఉదయం కుళాయిల నుండి బురద నీరు రావడంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి నీరు తాగితే అనారోగ్యం పాలు అవుతామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
ATP: శాంతి భద్రతలే లక్ష్యంగా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురడి గ్రామంలో సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొల్పడమే లక్ష్యంగా పాత నేరస్తులు, అనుమానితుల ఇల్లు, అక్రమ మద్యం అమ్ముతున్న నివాసాలలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని పేర్కొన్నారు.
విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాల్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం: గుత్తిలోని హజరత్ సయ్యద్ వలి భాషా ఖాద్రీ రహమతుల్లా అలైహి 677వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నిషాన్ జండా, సోమవారం గంధం, మంగళవారం ఉరుసు, బుధవారం జియారత్‌తో ఈ ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని దర్గా కమిటీ అధ్యక్షుడు కేఎస్ ఉమర్, కేఎస్ మైను మీడియాకు తెలిపారు.
KDP: మహిళల సమస్యలపై పాలకులు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఎల్ఐసీ కడప డివిజన్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షురాలు ఎం కామేశ్వరి అన్నారు. కడపలో శనివారం జరిగిన సమావేశంలో LIC మహిళా శ్రామిక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప డివిజన్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎల్ఐసీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
కడప: పొరుమామిళ్ళలో రోడ్డు ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే పొరుమామిళ్ళ గ్రామానికి చెందిన మాలిక్ బాషా (35) స్కూటర్ పై వెళ్తుండగా మొలకత్వ సమీపంలో స్కూటర్‌ను లారీ ఢీ కొనడంతో మాలిక్ భాషాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవస్థానానికి సంబంధించిన వసతి గదుల పైకప్పులను శుభ్రం చేస్తున్న పనులను ఆలయ ఈవో భద్రాజి పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
GNTR: పొన్నూరు మండలం ఆరెమండ పోస్ట్ ఆఫీస్‌లో ప్రజలు దాచుకున్న సొమ్ము గోల్ మాల్ అయిన సంఘటన చోటు చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోస్ట్ ఆఫీస్‌లో అవకతవకులు జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తన పరిధిలోని ప్రజల నుంచి సేకరించిన నగదును పాస్ పుస్తకాల్లో జమ చేయలేదని దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు.