• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కావలిలో పోలీసునంటూ బైక్ ఎత్తికెళ్లిన కేటుగాడు

NLR: కావలి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ నంటూ పోలీస్ డ్రెస్‌లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్‌ను ఎత్తుకెళ్లిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సైను ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు తీసుకురావాలని బుడంగుంట చెందిన ధనుశ్ అనే వ్యక్తి వద్ద నుంచి బైక్‌ను తీసుకువెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

September 22, 2024 / 11:18 AM IST

‘లైసెన్సులను రెన్యువల్ చేయించుకోవాలి’

తూ.గో: అనపర్తి బిక్కవోలు, రాయవరం మండలాల్లోని వ్యాపార సంస్థలు లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని సహాయ కార్మికశాఖాధికారి జి.కేశవరావు తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్నట్లయితే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులు రాయవరంలోని కార్మికశాఖ కార్యాలయంలో తమ పేరు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.

September 22, 2024 / 11:16 AM IST

‘ఆడపిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి’

VZM: ఆడపిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలను పెంపొందింప చేయాలని ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండల కేంద్రంలో ఆదివారం శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపధ 21వ వార్షికోత్సవం, పోటీ పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శ్రీహరి శర్మ చేస్తున్న కార్యక్రమాలను ఆమె కొనియాడారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు.

September 22, 2024 / 11:11 AM IST

నెల్లూరు డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి బదిలీ

నెల్లూరు: డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశి భూషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనను తన మాతృ శాఖ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంట్ నందు రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. గత మూడేళ్లపై చిలుకు ఈయన పీడీగా సేవలు అందించారు. ఈయన స్థానంలో నాగరాజకుమారిని పీడీగా నియమించారు.

September 22, 2024 / 11:11 AM IST

రణస్థలం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRKL: రణస్థలం శ్రీ రామాంజనేయ థియేటర్లో ఆదివారం ఓ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు హాజరయ్యారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

September 22, 2024 / 11:10 AM IST

‘రఘురామకృష్ణం రాజు క్షమించరాని నేరం చేశారు’

CTR: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని N.R అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాళ్ల మండలం ఏలూరు పాడులో రఘురామకృష్ణం రాజు అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించడం క్షమించరాని నేరమన్నారు.

September 22, 2024 / 11:06 AM IST

24న జిల్లా స్థాయి రెజ్లింగ్ క్రీడా ఎంపికలు

కడప: నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఎసీఎఫ్ రెజ్లింగ్ క్రీడా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి అరుణ కుమారి తెలియజేశారు. రెజ్లింగ్ అండర్ 14, అండర్ 17 బాల బాలికలు విభాగంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడప డీఎస్ఏ మైదానం ప్రాంగణంలో బాస్కెట్ బాల్ అండర్ 14,17 విభాగాలలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు.

September 22, 2024 / 11:02 AM IST

సత్యదేవుని ప్రసాద కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే

తూ.గో: శంఖవరం అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నూనె, ఇతర ముడి సరుకుల నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు. సత్యదేవుని ప్రసాదం దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిందని తెలిపారు.

September 22, 2024 / 11:01 AM IST

73 మంది డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ

ATP: జిల్లాలో 73 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ పొంది సంబంధిత కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు.

September 22, 2024 / 11:01 AM IST

కుమ్మరిపేటలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

విజయనగరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం తెర్లాం మండం కుమ్మరిపేట గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ముచ్చభాస్కర రావు అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.

September 22, 2024 / 11:00 AM IST

కంటి చూపు అందించడమే లక్ష్యం ఎమ్మెల్యే ఆకేపాటి

KDP: కళ్ళు కనపడక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు కంటి చూపు అందించడమే లక్ష్యమని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట ZP హైస్కూల్లో ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

September 22, 2024 / 10:58 AM IST

పులివెందులలో కోటి రూపాయల భారీ చోరీ

KDP: పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న విజయ హోమ్స్‌లోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు హరి నివాసంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ చోరీలో సుమారు రూ.కోటి నగదును దుండగులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

September 22, 2024 / 10:55 AM IST

నీటి సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రజలు

ప్రకాశం: దోర్నాల మండలంలోని అయిన మొక్కల గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం రహదారిపై ముల్లకంచవేసి బిందెల పట్టుకొని నిరసన తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని ఉన్నతాధికారులు చొరవ చూపి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.

September 22, 2024 / 10:54 AM IST

కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

కృష్ణా జిల్లా: నూజివీడు పట్టణంలోని ద్వారక ఎస్టేట్ ఆవరణంలో ఆదివారం వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన వంద రోజులలో గోరి కట్టిందన్నారు. లడ్డూ, పడవలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.

September 22, 2024 / 10:51 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం: టంగుటూరు మండలంలోని గొల్లూరమ్మ దేవస్థాన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం మధురైకు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

September 22, 2024 / 10:50 AM IST