PLD: చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే, వయసు హోదా అడ్డు రాదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు నిరూపించారు. కాగా ఆయన తాజాగా పట్టభద్రుడు అయ్యారు. చదువు మధ్యలో ఆపేసిన ఆయన ఇటీవల బీఏ( సోషల్ సైన్స్)డిగ్రీ పూర్తి చేశారు. పార్ట్-1, పార్ట్-2లో రెండింట్లోనూ ప్రథమ శ్రేణి సాధించారు. తన కోరిక నెరవేరిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకాశం: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పామూరుకు వస్తున్నట్లు మండల టీడీపీ నాయకులు తెలిపారు. రేపు పామూరులో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.
E.G: ఇంటింటికి రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎండియూ వ్యవస్థను రద్దుచేసి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మంచి నిర్ణయమన్నారు.
GNT: ఆదిత్య ఇన్ ఫ్రా అపార్ట్‌మెంట్స్ NOCని రైల్వే శాఖ రద్దు చేసిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించడం వలనే రైల్వే వారు NOCని రద్దు చేశారని, అయినప్పటికీ కార్పోరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
VSP: సింహాచలం ఆలయ కార్యనిర్వహణాధికారిగా వి.త్రినాథరావు ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. తర్వాత ఆలయ ఇంచార్జ్ ఈవో సుజాత ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
కృష్ణా: కృష్ణా జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో మేనేజర్, పారా మెడికల్ పర్సన్, బ్లాక్ కో-ఆర్డినేటర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తులను సెప్టెంబర్ 30లోపు కానూరు ఉమాశంకర్ నగర్లో ఉన్న మహిళా సంక్షేమ సాధికారత కార్యాలయంలో అందజేయాలన్నారు.
ప్రకాశం: దోర్నాల మండలంలోని అయిన మొక్కల గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం రహదారిపై ముల్లకంచవేసి బిందెల పట్టుకొని నిరసన తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని, ఉన్నతాధికారులు చూపి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.
కోనసీమ: ఆత్రేయపురంలో ఆదివారం జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశుధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే మచ్చపట్ల ధర్మరాజు ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్ర పటాన్ని ఈఓ కిషోర్ కుమార్ అందజేశారు.
KRNL: గోనెగండ్ల మండలం కులుమాల సచివాలయ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలకెత్తాయి. మూగజీవాలు గడ్డి తినడానికి అటుగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొండపై ప్రతి ఆదివారం జరిగే రథ సేవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రథం వెనుక అడుగులో అడుగు వేస్తూ రథ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
SRKL: జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్‌కు సారవకోట మండల పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామానికి వరుదు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ దాస్‌ను అభినందనలతో ముంచెత్తారు.
GNTR: పెదకాకాని మండలం లూథర్‌గిరి కాలనీలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కూటమి 100 రోజుల పాలన, చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం TDP రాష్ట్ర నాయకులు సురేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుకతో భవన నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుందని అన్నారు.
ATP: ముదిగుబ్బ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం పరిటాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్ బాబు, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ATP: పుట్టపర్తి పట్టణం చిత్రావతి రోడ్డులోని శ్రీదుర్గామాత దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ శనివారం వరకు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామని దుర్గామాత ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. పూజలకు భక్తులు సహకరించాలని కోరారు.