• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకాశం ప్రజలకు పోలీస్ కీలక సూచన ఇదే!

ప్రకాశం: మీ ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఉందా.. లేకుంటే సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం పోలీసులు. ఇందులో భాగంగా SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా ఆధార్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్‌కు బయోమెట్రిక్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని, సూచించారు.

October 5, 2025 / 03:45 PM IST

‘థాంక్యూ’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: పెదవేగి మండలం పినకడమీలో యువశక్తి ఆటో ఓనర్స్ & వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన “థాంక్యూ” కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూటమి అండగా ఉందన్నారు.

October 5, 2025 / 03:42 PM IST

రేపు పిఠాపురంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం

KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాడా పీడీ వేణుగోపాలరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తామని చెప్పారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రజలు ఆన్‌లైన్ ద్వారా కూడా అర్జీలు సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు.

October 5, 2025 / 03:36 PM IST

వెంకటగిరి ESS కాలేజీ లెక్చరర్‌కు డాక్టరేట్

TPT: వెంకటగిరి ESS కళాశాల కామర్స్ లెక్చరర్ సాధనాల శ్రీనివాస్ చౌదరికి డాక్టరేట్ లభించింది. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ సీఎన్ కృష్ణనాయక్ మార్గదర్శకత్వంలో ‘ఎంపీరియల్ స్టడీ ఆన్ ది రోల్ ఆఫ్ యూపీఐస్ ఇన్ ప్రాపెల్లింగ్ ది విజన్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఏపీ’ అనే అంశంపై ఆయన పరిశోధనపై ఆయన డాక్టరేట్ వచ్చింది.

October 5, 2025 / 03:35 PM IST

సొంతంగా శ్రమదానంతో తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు

ASR: కొయ్యూరు మండలం పాడి, రత్నంపేట గ్రామాల మధ్యలో కొండవాగుపై బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు శ్రమదానంతో వంతెన వద్ద రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత నిధులతో జేసీబీ వాహనం ఏర్పాటు చేసి వాగుపై బాట ఏర్పాటు చేసుకుంటున్నారు. పాత వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

October 5, 2025 / 03:34 PM IST

ముదినేపల్లిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

ELR: ముదినేపల్లిలోని పోలరాజ్ కాలువలో గల్లంతయిన విమల (65) ఆచూకీ కోసం 3వ రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగాయి. అమలాపురం నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ బృందం పర్యటించే బోటు శనివారం మరమ్మతులకు గురవడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. కాకినాడ నుంచి మరో బోటు తీసుకువచ్చి ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు పర్యవేక్షించారు.

October 5, 2025 / 03:34 PM IST

ఎయిర్‌పోర్ట్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు

SKLM: పలాస కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బిడిమి గ్రామం సమీపంలో చేప‌ట్టనున్న ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం సమీప గ్రామాలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

October 5, 2025 / 03:33 PM IST

అప్పారావు మృతి తీరని లోటు: ఎంపీ

KKD: సీనియర్ పాత్రికేయులు అడపా అప్పారావు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు దశాబ్దాలకుపైగా వివిధ హోదాల్లో జర్నలిస్ట్‌గా పని చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అప్పారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

October 5, 2025 / 03:29 PM IST

‘ఈ నెల 8న జరిగే ధర్నాలను జయప్రదం చేయాలి’

ELR: ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరులో వారు మాట్లాడారు. ఐఆర్ ఇవ్వాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయాలన్నారు.

October 5, 2025 / 03:26 PM IST

శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై సమీక్ష

GNTR: తుళ్లూరు క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు Dy. CM పవన్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

October 5, 2025 / 03:26 PM IST

కార్మికుల జీతాలు పెంచాలని మంత్రికి వినతి

TPT: మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని మంత్రి పొంగూరు నారాయణకు ఆదివారం సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఇందులో భాగంగా గూడూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన మంత్రిని సీఐటీయూ నాయకులు కలిశారు. మున్సిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

October 5, 2025 / 03:26 PM IST

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

కోనసీమ: అమలాపురం పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించబోయే అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు , నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామాల్లో అన్ని వర్గాల వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు.

October 5, 2025 / 03:22 PM IST

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

ELR: నూజివీడు రూరల్ ఎస్సై రామకృష్ణ ఆదివారం బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు అక్రమంగా బాణాసంచా తయారీ, నిల్వ లేదా విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అందువల్ల ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

October 5, 2025 / 03:21 PM IST

కళ్యాణ మండపానికి ఎంపీ భూమి పూజ

సత్యసాయి: పరిగి మండలం కోడిగినల్లి గ్రామంలో సాదర కులస్తుల ఆధ్వర్యంలో నిర్మించబోయే కొత్త కళ్యాణ మండపం భూమిపూజ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ సామూహిక అభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు అవసరమని, కళ్యాణ మండపం గ్రామ సమాజ అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని ఎంపీ అన్నారు.

October 5, 2025 / 03:20 PM IST

ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: నాయక్ నగర్ స్మాష్ బ్యాడ్మింటన్ అకాడమీలో అండర్-17 బాల, బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని రాణించాలని సూచించారు.

October 5, 2025 / 03:20 PM IST