ELR: కుక్కునూరు మండలం పెద్దరాయిగూడెం పంచాయతీ బరపట్టినగరం గ్రామంలో ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొరగం శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 కుటుంబాలు గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. దీంతో గ్రామంలో విద్యుత్తు సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
AKP: గొలుగొండ శాఖ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని గొలుగొండ శాఖ లైబ్రేరియన్ రాజుబాబు తెలిపారు. ఇందులో భాగంగా నేడు మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో పుస్తకాలు చదివించామని పేర్కొన్నారు.
కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చు పర్యాటకులు మెరైన్ పోలీస్ వారి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని పాలకాయ తిప్ప మెరైన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హంసలదీవి బీచ్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులకు సముద్ర స్నానాలు ఆచరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు.
ASR: జిల్లా కేంద్రం పాడేరులో BSNL సేవలు నెలరోజులుగా తరచూ మొరాయిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి సేవలు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. 2006 పాడేరు ఏజెన్సీలో మొట్టమొదటిగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. తరచూ సంకేతాలు మూగపోవడంతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు.
బాపట్ల: చీరాలలో పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వా విద్యా లయం పేరును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మార్చుకోవాలని.. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
AKP: అనకాపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కసింకోట మండలం నర్సింబల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
NLR: రాపూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు ఎస్సై వెంకట రాజేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ… రాపూరు పట్టణంలో ని పాత బస్టాండ్, మూడు రోడ్ల కూడలిలో ప్రధాన రహదారులపై అడ్డంగా పెట్టిన వాహనాలు, తోపుడు బండ్ల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అనంతరం ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ప్రకాశం: సంతనూతలపాడులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎండ్లూరు వద్ద గల ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళాసాధికర కేంద్రంలో 3నెలల పాటు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అధికారి జె. రవితేజయాదవ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 15-45 సంవత్సరాలలోపు గల నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: మర్రిపాడు మండల కేంద్రానికి చెందిన ఏడేళ్ల ఓ చిన్నారికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో పాప వైద్య చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని కూరగా తన వంతు సహకారం గా 25000 అందించి మానవత్వం చాటుకున్న మర్రిపాడు టిడిపి సీనియర్ నాయకులు SK మహబూబ్ సాహెబ్. నేడు చిన్నారికి రూ. 25,000 అందించిన మహబూబ్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు.. ఈ చిన్నారి వైద్యానికి దాతలు సహాయపడాలని కోరారు.
NLR: వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం కేంద్రంలో రవాణా శాఖకు సంబంధించి యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాహనదారులు కోరుతున్నారు. గతంలో కావలిలో ఉన్న యూనిట్ కార్యాలయాన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయంగా ప్రభుత్వం మార్పు చేసి రుద్రకోటలో ఏర్పాటు చేసింది. ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, లైసెన్సులు, ఫిట్నెస్ కొరకు 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని వాహణదారులు వాపోతున్నారు.
AKP: చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం పాలనను గాడిలో పెడుతోందని మాడుగుల ఎమ్మెల్యే అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన వేచలంలో పర్యటించారు. ప్రజాసంక్షేమమే ధ్వేయంగా మంచి పాలన అందిస్తుందని పేర్కొన్నారు. మూడునెలల్లో ప్రభుత్వ విజయాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని ఇంకా 57నెలల్లో ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించాలన్నారు.
KRNL: కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలకకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే అర్జీలు ఇవ్వాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం: భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం జిల్లాలోని గాంధీజీ వనం వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రౌతు సుమతి మోహనరావు, సురేష్, రవి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
SRKL: రాష్ట్ర అభివృద్ధిని ముంచేసిన ఘనత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనిని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం చెల్లయ్యవలస పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 70సంవత్సరాల్లో కేవలం 3 లక్షల 60 కోట్ల రూపాయలు ఉంటే గడచిన 5సంవత్సరాలలో దానిని 11లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.
WG: రక్తదానంపై యువకుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చినబాబు అన్నారు. భీమవరం బేతనిపేట వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో 1546వ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు.