NLR: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం స్థాయిలో గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డ్ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. వైద్య పరీక్షలు నిమిత్తం హాజరయ్యే వారు వారి ఆధార్ కార్డ్ తీసుకుని హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు.
GNTR: బీజేపీ నాయకులు మాజీ సీఎం జగన్‌ను దూషించటం, వైసీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం చాలా దుర్మార్గమైన చర్య అని తాడేపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షుడు వేణుగోపాలస్వామి రెడ్డి అన్నారు. తాడేపల్లి పట్టణ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలు బయటకు రాకుండా ఉండటానికి తిరుపతి లడ్డు కల్తీ అని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
WG: రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఉమా మహేశ్వర రావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై, అంబేడ్కర్ ఫ్లెక్సీ చింపి ప్రజల మధ్య కుల, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిడదవోలులో KVPS నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు.
VZM: గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు (జనరల్ ఫండ్) విడుదల అయ్యాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం ఉత్తరాపల్లిలో ఆదివారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హామీలను విడతలవారీగా అమలు చేస్తున్నామన్నారు.
VZM: గజపతినగరం సర్పంచ్ నరవ కొండమ్మతో పాటు బొండపల్లి మండలం ముద్దూరు, తమటాడ గ్రామాలలోని వైసీపీకి చెందిన 250 కుటుంబాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ పార్టీ ప్రవర్తించిందని ఎద్దేవా చేశారు.
ELR: దెందులూరు మండలం ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీనివాసరావు తాజాగా ఏలూరు జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. దెందులూరు మండలం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
ATP: పామిడి మండలం రామగిరి దిగువ తండా గ్రామంలో ఆదివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ… నాటు సారా తయారు చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా 800 లీటర్ల నాటు సారా బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.
TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వీఆర్ కండ్రిగ – టిపి పాలెం రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ… రెండు నెలల క్రితం మరమ్మతుల పేరుతో జేసీబీతో రోడ్డును సర్వ నాశనం చేశారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కోనసీమ: యువతి, యువకులకు క్రమశిక్షణ సచ్చీలత ఎంతో అవసరమని కొత్తపేట ఎస్సై జి సురేంద్ర సూచించారు. శతాబ్ది డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ కట్టా నాగమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో SI సురేంద్ర పాల్గొని, పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లొద్దని, ఎవరిని నమ్మొద్దని అన్నారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి వెలిగండ్ల మండలం గోగులపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజలు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆదివారం అందజేశారు. కనిగిరి అభివృద్ధిలో తాముకూడా భాగస్వామ్యంలో అయ్యేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: నెల్లిమర్ల ఎస్సైగా బి.గణేశ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రం డీసీఆర్బీ ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై విచ్చేశారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన రామ గణేశ్ దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. నెల్లిమర్ల నగర పంచాయతీ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని గణేశ్ తెలిపారు. గంజాయి నిర్మూలన, నిషేధఅంశాలపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ELR: ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
కోనసీమ: రైల్వే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు కూడా విడుదల చేస్తే రైల్వే లైన్, వంతెన పనులు మరింత వేగం పుంజుకుంటాయని కోనసీమ రైల్వే సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు.కేఆర్ఎస్ఎస్ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ కో-కన్వీనర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు రాయవరపు సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు భారీ విరాళం అందజేశారు. వాడపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టబోయే 500 రూమ్‌ల విశ్రాంత గదులకు ప్రథమంగా ఒక రూమ్‌కు రూ. 15, 31, 000 దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా ఆలయ ఈఓ సత్కరించారు.
కృష్ణా: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులు(2024-25విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది.