VSP: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన రీజనల్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అనేక పాలసీలు తెచ్చిందని పేర్కొన్నారు.