KDP: కలసపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వైద్యులు శైలజ, సాయితేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు వచ్చిన మహిళలకు అన్ని రకముల వైద్య పరీక్షలు చేశామన్నారు. ఆరోగ్యంపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. ఏపీ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ రహమతుల్లా హాజరయ్యారు. అనంతరం ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.