ELR: పెదపాడు మండలం అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఛైర్మన్, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి నాయకులు పాల్గొన్నారు.