కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి అర్జీలను సోమవారం స్వీకరించారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు అర్జీలను కలెక్టర్ అందజేశారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జిల్లా ప్రకృతి వ్యవసాయ డిస్ట్రిక్ ప్రాజెక్టు మేనేజర్ నూకరాజు, ప్రకృతి వ్యవసాయం డిస్టిక్ కోఆర్డినేటర్ అరుణ కుమారి ఆధ్వర్యంలో సోమవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 50 లీటర్ల అగ్నిస్తం కషాయాన్ని తయారు చేశారు. ఇది వరిలో వివిధ రకాల పురుగుల నివారణకు ఉపయోగపడుతుందన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలో నిర్వహించనున్న శక్తి పటాల ప్రదర్శనల్లో DJలకు అనుమతి లేదని DSP CH రాజా సోమవారం ప్రకటించారు. మూలా నక్షత్రం సందర్భంగా నగరంలోని శక్తి పటాలు అన్నీ సోమవారం రాత్రి కోనేరు సెంటర్‌కు చేరతాయన్నారు. ఈ క్రమంలో DJలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శక్తి పటాల ప్రదర్శకులు పోలీసు వారికి సహకరించాలన్నారు.
అన్నమయ్య: చిన్నమండెం కస్పా నందు మైనార్టీ TDP కార్యకర్త మహమ్మద్ ఖాన్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం వారి స్వగృహానికి వెళ్లి మహమ్మద్ ఖాన్‌ను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య వివరాలను తెలుసుకుని క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
W.G: నరసాపురం మండలం కొప్పర్రులో శ్రీ సీతారామ స్వామి ఆలయ ఛైర్మన్‌గా పోలిశెట్టి గణేశ్వరరావును నియమించినట్లు ఈవో రామచంద్రరావు తెలిపారు. ఆయనతో పాటు సీహెచ్ అప్పారావు, ఆర్.శ్రీను, డి.గంగమ్మ, ఆర్.నాగలక్ష్మి, ఎ.వీర వెంకట సత్యనారాయణ, డి.రామ లక్ష్మి, ఎం.వెంకటసత్యనారాయణ పాలకవర్గ సభ్యులుగా ఇవాళ నియమితులయ్యారు. కొత్త కమిటీని పలువురు అభినందించారు.
అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ కేంద్రం నుండి ఇటీవల శ్రీశైలం దేవస్థానం ఆలయ చైర్మన్‌గా పోతుగుంట రమేష్ నాయుడు నియామకం జిల్లాకే గర్వకారణం అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్ అన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నూతన ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రమేష్ నాయుడును కలిసి శాలవాతో ఘనంగా సన్మానించారు.
NLR: కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి సుబ్బారామిరెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
W.G: నరసాపురం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. తొలుత ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు ఆయన సూచించారు. హాస్పిటల్ ఉన్న మరుగదొడ్లును ఎప్పటికప్పడు శుభ్రం చేయాలని చెప్పారు.
NLR: టీటీడీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వెలిసిన శ్రీ మహాలక్ష్మీ అంబాబాయ్ అమ్మవారికి సారె, పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు సారథ్యంలో ఇతర బోర్డు మెంబర్లు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టు వస్త్రాలు, సారెను అందజేశారు.
VSP: ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని, పక్కా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌లతో కలిసి ఆయన ప్రజల నుంచి 365 వినతులు స్వీకరించారు.
NLR: జలదంకి మండలం, బ్రాహ్మణక్రాకలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతన్నలతో మాట్లాడుతూ.. ‘రైతు ప్రభుత్వం’ అనగానే గుర్తొచ్చే పేరు టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతు రాబడి పెంచే దిశగా, గౌరవం కాపాడే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
W.G: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ఆ ఉద్దేశంతోనే మహిళల సంక్షేమానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ద్యేయంగా పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.
VSP: విశాఖలోని ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులను వీఎంఆర్‌డీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ కెఎస్.విశ్వనాథన్ సోమవారం పరిశీలించారు. పనులను నిర్దేశించిన కాలపరిమితిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఆయన గుత్తేదారును, అధికారులను ఆదేశించారు. సంబంధిత రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని అనుమతులు వచ్చేలా చూడాలని సూచించారు.
అన్నమయ్య: జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి వద్ద విద్యుత్ లైనుకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి పశ్చిమ బెంగాల్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వబర్ధమాన్ జిల్లా, రామగోపాల్ పూర్‌కు చెందిన సంజయ్ బాగ్ది (32), ఓ లైన్మెన్‌కు సహాయకుడిగా పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. కాగా, ఘటనపై రాయచోటి ఏఎస్సై గోపి నాయక్ వివరాలు వెల్లడించారు.
సత్యసాయి: మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రేపు హిందూపురంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇంఛార్జి TN దీపిక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.