ATP: పామిడి మండల కేంద్రానికి చెందిన పలువురు మహిళలు బీజేపీలో చేరారు. యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మండలంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
KRNL: పదవీ విరమణ పొందిన AR DSP భాస్కర్ రావు, ASI శివరామి రెడ్డిలను జిల్లా SP విక్రాంత పాటిల్ సోమవారం సన్మానించారు. కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఆర్ముడ్ రిజర్వుడుకు చెందిన డీఎస్పీ కె.భాస్కర్ రావును, వెల్దుర్తి PSకు చెందిన ASI బి.శివరామిరెడ్డిలను ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం SP మాట్లాడుతూ.. కుటుంబాలతో సంతోషంగా గడపాలని సూచించారు.
NLR: బుచ్చి మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులను 27 వార్డులుగా పునర్విభజించ బడుటకు గుంటూరు పురపరిపాలన శాఖ నుంచి ప్రతిపాదించబడిందని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వార్డు విభజనకు సంబంధించిన డ్రాప్ట్, వార్డు మ్యాపులు, మున్సిపల్ కార్యాలయంలో పరిశీలనకు ఉంచడం జరిగిందన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల లోపు తెలపాలని పేర్కొన్నారు.
అన్నమయ్య: ప్రజలను కనువిందు చేసేందుకు టైటానిక్ ఎగ్జిబిషన్ అన్ని హంగులతో సిద్ధంగా ఉందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ మేరకు ఇవాళ టిప్పు సుల్తాన్ మైదానం నందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. కాగా, ఇంటిళ్లపాదిగా సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి యజమాని సీ.కే. దినేష్ కుమార్, కో- ఆర్డినేటర్ కె, వేణుగోపాల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ELR: వర్తకులు జీఎస్టీ 2.0 ప్రకారం తగ్గిన ధరలకే వస్తువులను వినియోగదారులకు అందించాలని ఉంగుటూరు MPDO మనోజ్ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రచారంలో ఉపాధి హామీ పథకం శ్రామికులకు ఏ ఏ అంశాల్లో ధరలు తగ్గే అవకాశం ఉందో వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
VSP: నాటి వైఎస్.జగన్ ప్రభుత్వంపై విశాఖ విఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవి.ప్రణవ్ గోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం 7 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల కన్నీటి బకాయిలను తీరుస్తూ వస్తుందని చెప్పుకొచ్చారు.
AKP: పరవాడ వైసీపీ కార్యాలయంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ సోమవారం ‘డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరిగినా వేధింపులకు గురైనా డిజిటల్ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయాలన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. కోటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు స్థానిక కళాశాల యాజమాన్యంతో పది స్టాపర్లను సోమవారం భోగాపురం సీఐ రామకృష్ణ ఏర్పాటు చేశారు. డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్టాపర్లను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమలో ఎస్సై సన్యాసి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సోమవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఈ జీఎస్టీ తగ్గింపుతో కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో MBA మరియు MCA కోర్సులు చదువుతున్న Y21-Y24 బ్యాచ్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఎటువంటి జరిమానా లేకుండా అక్టోబర్ 15 లోపు, రూ.200 జరిమానాతో అక్టోబర్ 18 లోపు పరీక్ష రుసుము చెల్లించాలి.
SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియను సోమవారం చేపట్టామని ఈవో వాసుదేవరావు తెలిపారు. అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత 90 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా 2 లక్షల 13వేల 803 రూపాయిలు వచ్చిందని తెలియజేశారు.
BPT: ప్రజల ఫిర్యాదులను ప్రథమ ప్రాధాన్యతతో నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
CTR: పూతలపట్టు మండలం కొత్తకోట పంచాయతీ మోటకంపల్లి వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో రైలు ఇంజన్ మాత్రమే పట్టాలు తప్పడంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. రైలు రాకపోకలకు ఇబ్బంది కావడంతో రైల్వే సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు చేశారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
TPT: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న జనసేన అధ్యక్షులు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఎమ్మెల్యే జనసైనికులతో కలిసి కొబ్బరి కాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు .
సత్యసాయి: ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో RWS, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత తప్పక పాటించాలని సూచించారు.