TPT: దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామపంచాయతీలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్ ఇట్టగుంట ధనుంజయ మృతి చెందారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వారి ఇంటికి చేరుకుని, ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధైర్యంగా ఉండాలని సూచించారు.
VZM: దేవి శరన్నవరాత్రిలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో సోమవారం మూలా నక్షత్రం సందర్బంగా శ్రీ సరస్వతి పూజను పిల్లలచే జరిపించారు. ఆలయ అర్చకులు సోమశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పిల్లలు హాజరైనట్టు ఛైర్మన్ శంకర్ రెడ్డి తెలిపారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు,పెన్సిల్స్,పెన్స్ పంచిపెట్టారు. అలగ్గే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా సోమవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య ప్రజల నుండి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
KRNL: గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై పోరుబాట పట్టారు. అన్ని పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదని, వచ్చే ప్రయోజనాలు తెలియజేయడం లేదని తెలిపారు. ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి సచివాలయ ఉద్యోగులు ఎగ్జిట్ లెఫ్ట్ అయ్యారని ఈమేరకు ఎమ్మిగనూరు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందరాజులు తెలిపారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం వెంకట లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం వారు 60 వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కుల జన గణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఐకమత్యమే మహాబలమని బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
NDL: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి అనంతరం శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిశాయి.
W.G: పెనుమంట్రలో ఇవాల ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ వ్యాధుల లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారికి పలు వైద్య పరీక్షలు చేసి ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే తమని సంప్రదించాలని ఏఎన్ఎం భాగ్య కుమారి సూచించారు. మీకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉన్న మాకు తెలియాపర్చాలని భాగ్య కుమారి తెలిపారు.
KRNL: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. పెద్దటేకూరు గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తోందన్నారు. వేలిముద్రలు పడకపోయినా ఆ కార్డును స్కాన్ చేసి రేషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
NLR: జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు కలెక్టర్ హిమాన్స్ శుక్లా ఆదేశానుసారం వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఎకరం వరిసాగుకు 135 కేజీలు(మూడు బస్తాలు) చొప్పున అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి రైతుకు ప్రత్యేక కార్డు ఇవ్వనున్నారు. ఒకేసారి కాకుండా 10 రోజుల వ్యవధిలో మూడు విడతలుగా ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణ నూతన సీఐగా హరినాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
AKP: రైతులకు సకాలంలో తక్కువ వడ్డీకి పంట రుణాలు అందించనున్నట్లు నక్కపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి అన్నారు. ఇవాళ స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంమంత్రి వంగలపూడి అనిత సహాయ సహకారంతో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాములు పామిడి మండలం కళాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప గ్రామ పంచాయతీ వద్ద పీహెచ్సీ వైద్యులు డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు క్యాన్సర్ నిర్ధారిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం గురించి వివరించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 6309 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సోమవారం పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,000 మందికి, జిల్లాలో 6309 మందికి, పెనుకొండ నియోజకవర్గంలో 1038 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.