ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో దసరా పండుగ సందర్భంగా బుధవారం ఆయుధ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ నారాయణస్వామి, చైర్పర్సన్ భవాని హాజరయ్యారు. కార్యాలయంలోని వాహనాలకు ఆయుధ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికులకు అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షించారు.