CTR: కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.టి సుధారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. తనిఖీ అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సిబ్బంది బాద్యతగా పనిచెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.