CTR: రాయచోటి నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పెద్ద ఆదరణగా మారిందని డాక్టర్ మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మేరపూరి ఆదినారాయణకు రూ.53,000, వల్లూరు రజియాకు రూ.40,000 చెక్కులు అందజేశారు. అనంతరం చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.