శ్రీకాకుళం: జిల్లాలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారెడ్డి సతిసమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో సౌర హోమం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, వారికి స్వామి ప్రసాదాలన జ్ఞాపికను బహుకరించారు.
మన్యం: వీరఘట్టం- పాలకొండ ప్రధాన రహదారి వండువ సమీపాన భారీ వాహనాల రాకపోకలు వల్ల ప్రధాన రహదారి ఎక్కడికక్కడే గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరంతా గోతిలో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి ఈ విధంగా ఉండడం వల్ల తరచుగా వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను పాలకొండ ఎస్డీపీవో ఎం రాంబాబు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
ATP: బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామంలోని రైతులతో సమావేశమయ్యారు. జీడిపల్లి ముంపు ప్రాంత ప్రజలను ఆదుకుంటామన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఉరవకొండ పోలీసులు తగిన బందో బస్త్ ఏర్పాటు చేశారు.
KKD: సామర్లకోట నుంచి సర్పవరం వెళ్లే రహదారిలో ఉండూరు రైల్వేక్రాసింగ్ గేట్‌ను సెప్టెంబర్ 30వ తేదీన మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాక్ రిపేర్లు కారణంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్‌కు చెప్పొచ్చని తెలిపారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని 13వ వార్డులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్యెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప: మైలవరం మండలం వేపరాల గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి చౌడేశ్వరిదేవి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.
KKD: సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వందరోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు.
సత్యసాయి: గాండ్లపెంట మండలంలో సోమవారం ఎమ్మెల్యే కదిరి కందికుంట వెంకటప్రసాద్ పర్యటిస్తున్నట్టు వారి క్యాంపు కార్యాలయం నుంచి తెలిపారు. ఆయన రెక్కమాను, కురుమామిడి, గ్రామాల్లో జరగనున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు, పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
NLR: వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండ్ల రామక్రిష్ణ ఆదివారం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసి పోలేరమ్మ జాతరకి రావాలని ఆహ్వానం పలికారు. ఆయన వెంట ఆలయ ఈఓ, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరి ప్రసాదరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్చూరులోని కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
NLR: సిటీ నియోజకవర్గంలోని 40వ డివిజన్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కమిషనర్, అధికారులు, పాల్గొన్నారు.
శ్రీకాకుళం: ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి సూచనల మేరకు ఆదివారం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లోలో నార్కోటిక్ డ్రగ్స్ ప్యాడ్‌తో పాటు ఆముదాలవలస ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో ఎక్స్ప్రెస్ రైల్లో, బస్సుల్లో గంజాయి రవాణా గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో గంజాయిని వాడకుండా నిల్వ చేయకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం సమీకరించిన నిధులతో ఆదివారం అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లిపాలెంలో 350 వరద బాధిత కుటుంబాలకు వంటపాత్రలు, కుక్కర్లు, బకెట్లను పంపిణీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లను ఎంపీపీ సుమతి దేవి, సర్పంచ్ విజయ్ కుమార్, మండల జనసేన అధ్యక్షుడు గుడివాక శేషుబాబు అందజేశారు.