ASR: దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. ఎస్ రామన్నపాలెం గ్రామపంచాయతీలో ఉన్న వెలగపెల్లి, గుంపెనపల్లి గ్రామాలకు వెళ్లాలంటే ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ నిత్యం ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో ప్రాణాలను ఫలంగా పెట్టి దాటవలసి వస్తుందని ఆయా గ్రామస్తులు తెలుపుతున్నారు.
NLR: టీపీ గూడూరు, సౌత్ ఆములూరులో కూటమి నేతల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుడు శ్రీనివాసులును మాజీ మంత్రి కాకాని ఇవాళ పరామర్శించారు. టీడీపీ నాయకుల దాడిని ఖండించిన కాకాని, శ్రీనివాసులు తలకు 6 కుట్లు పడినా మొక్కుబడిగా బెయిలబుల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్తులు, రౌడీషీటర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, లైంగిక దాడులు, నేరాలను అరికట్టేందుకు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని హెచ్చరిస్తూ, మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.
E.G: రంగంపేట మండలం చండ్రేడు గ్రామానికి చెందిన మద్దిపూడి సత్తిబాబు ఆదివారం అనపర్తి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జుత్తుక సూర్యకుమారి చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు సత్తిబాబును ఎమ్మెల్యే, టీడీపీ నేతలు అభినందించారు.
TPT: వరదయ్య పాలెం మండలం బీఎస్ పేట గ్రామంలో దేవాంగుల కుల దేవత శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం పూజలో భక్తులు పాల్గొని భక్తిని చాటుకున్నారు. కాగా, గ్రామంలో 35 ఏండ్ల తర్వాత అట్టహాసంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు జరుగుతుంది.
SKLM: ప్రజల భక్తి, సేవా భావం కలిసినపుడు ఆ స్థలమే పవిత్ర ధామంగా మారుతుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం సాయంత్రం పాతపట్నం మేజర్ పంచాయతీలో అయ్యప్ప స్వామి సన్ని ధానాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి భావం జ్వలించాలి. దాని వల్ల సమాజంలో ఆధ్యాత్మిక శాంతి, ఐక్యతను అందిస్తుందన్నారు.
TPT: తిరుపతి టూ చంద్రిగిరి రైల్వేస్టేషన్‌ల మధ్యన రైల్వేపట్టాలపై గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఇందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తి రైల్వేపట్టాల పైన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వేపట్టాల పైన తల మొండెం వేరువేరుగా పడి ఉంది. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన పిర్యాదు మేరకు రైల్వే పోలీస్ మృతదేహాన్ని SVమెడికల్ కాలేజీ మార్చురికి తరలించారు.
VSP: ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం ఇవాళ మధురవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆర్ఎం హామీ ఇచ్చారు. విశాఖ జిల్లాలోని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులంతా పాల్గొన్నారు.
E.G: సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. టౌన్‌కు చెందిన నరాకుల నరసింహ స్వామికి రూ.30,786, పాపాయమ్మకు రూ.57,205, రామకృష్ణకు రూ.27,493, భాస్కరరావుకు రూ.1,27,786, జయశ్రీకి రూ.28,409 చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.2,71,680 మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
VSP: గాజువాకలోని పెద గంట్యాడ శివారులో ఏర్పాటు కానున్న అదానీ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ నిర్మాణ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ యూనిట్ వల్ల కాలుష్యం భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇవాళ సాయంత్రం పెద గంట్యాడ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
E.G: రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం, గోపాలపట్నం గ్రామాలకు చెందిన ఎంపీటీసీ బత్తుల కరుణాకర్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కరుణాకర్‌కు జనసేన పార్టీ కండువా వేసి ఆదివారం సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామకృష్ణ చేసే అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
VSP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం అని, ఆయనకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర వైసీపీ నేతల సమావేశం ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
W.G: దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం గునుపూడిలోని శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా మహా నివేదనకు హారతులు ఇచ్చి పూజలు చేశారు.
KRNL: జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఇవాళ చోటు చేసుకుంది. జిల్లా రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా, కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ దాట్ల పార్వతి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు పార్వతీ కుటుంబ సభ్యులు 25,116 రూపాయల విరాళాన్ని వారు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు ప్రసాదాలను ఇచ్చారు.