PPM: కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 37 మంది విద్యార్థినిల్లో ముగ్గురు ICUలో, మిగిలిన వారు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జాండిస్, జ్వరానికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారని వెల్లడించారు. హెపటైటెస్-ఏ లోపం కూడా గుర్తించారని దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా వేస్తామన్నారు.