NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామం ZPHS హైస్కూల్ ఆవరణంలో NRM హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మధుమేహ (షుగర్) వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరం నందు 152 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి, మందులు పంపిణీ చేశారు. BSP రాష్ట్ర కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు పాల్గొని మాట్లాడుతూ.. బీపీ, షుగర్, ఆర్తో, ఈసీజీ మొదలగు పరీక్షలు ఉచితంగా చేశామన్నారు.