ELR: పెదవేగి మండలం న్యాయంపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై సీఐ రాజశేఖర్ ఆదివారం ఆకస్మిక దాడులు చేశారు. సీఐ మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. ఐదుగురు జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. రూ. 9,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.