E.G: ప్రకృతి వ్యవసాయం అమలులో మహిళల పాత్ర అభినందనీయమని బ్రెజిల్ బృందం ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో బ్రెజిల్, UAE, శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం ఇవాళ కాపవరం, కురుకూరు, ఎర్నగూడెం గ్రామాలను సందర్శించింది. ఈ పర్యటన రైతు సాధికార సంస్థ, నౌ భాగస్వాములు సంయుక్తంగా నిర్వహించారు.