ELR: ఆగిరిపల్లి మండలం అడివి నెక్కలం బుడ్డగూడెం కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ను అందజేశారు. అలాగే లబ్ధిదారుల యోగ క్షేమాలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.