ప్రకాశం: మహిళలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దారవీడు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ కవిత పేర్కొన్నారు. సోమవారం సుంకేసుల గ్రామంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.