ASR: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించాలని పలువురు పీహెచ్సీ వైద్యులు కోరారు. ఈ మేరకు సోమవారం అరకులో ఎంపీ డా.గుమ్మా తనూజా రాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. పీహెచ్సీల వైద్యుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. కానీ, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీంతో విధులను బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.