కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన నియోజకవర్గ పీఆర్వో(ప్రజా సంబంధాల అధికారి)గా ప్రసాద్ నాయుడును నియమించారు. వాడపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రసాద్ నాయుడు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు సమర్థవంతంగా మీడియాలో ప్రతిఫలించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.