కోనసీమ: కుస్తీ పోటీల్లో మండపేట ఎంపీఎస్ విద్యార్థి తాతపూడి నితీష్ బాబు విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అండర్ 14 యాభై రెండు కిలోల విభాగంలో ఈ పోటీలు కాకినాడ డీఎస్సీ గ్రౌండ్స్‌లో జరగగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వారిలో నితీష్ బాబు ఒకరిగా ఉన్నాడు. ఈ సందర్భంగా నితీష్‌ను పలువురు అభినందించారు.