SKLM: జిల్లాస్థాయి యోగా పోటీలలో రామకృష్ణాపురం శ్రీ సత్య సాయి విద్యావిహర్ విద్యార్థులు సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం జరిగిన పోటీలలో అండర్ 17 విభాగంలో టీ. జానకిరామ్, ఈ. చరణ్, జీ. దీక్షిత్‌లు అండర్ 14 విభాగంలో ఎం. జస్వంత్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు.