EG: ద్విచక్ర వాహన మెకానిక్ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తమ భవాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర వాహన మెకానిక్లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి, ఇవాళ వాటి పత్రాలను వారికి అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.