ప్రకాశం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్ చేయాలని సీపీఎం ముండ్లమూరు కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. సోమవారం మారెళ్ళ గ్రామంలో అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం బాధాకరమన్నారు.