NLR: వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆయనపై ఉన్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
KDP: చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలను నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
NLR:వెంకటగిరి పట్టణంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతరపై శనివారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ శాంతి కమిటీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. జాతర నిర్వహణపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల మండలం నారాయణపురం కుడి ప్రధాన కాలువ శివారు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఈ ఖరీఫ్ సీజన్లో అందలేదని మండల మాజీ జడ్పిటీసీ సభ్యులు సనపల నారాయణరావు శనివారం తెలిపారు. సాగునీటి సమస్య పై ఆన్లైన్ చేసిన అర్జీ పత్రాన్ని ఈనెల 23న జిల్లా కలెక్టర్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందించడానికి స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
NLR: విజయవాడ వరద ముంపు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించిన నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం కార్మికుల సేవలు అత్యంత ప్రశంసనీయమని కమిషనర్ సూర్యతేజ కొనియాడారు. శనివారం స్థానిక కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం సన్మానించి నూతన వస్త్రాలు, కుట్టుకూలి మొత్తం ప్రోత్సాహకాన్ని కమిషనర్ అందజేశారు.
CTR: ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గుడిపాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కంపెనీలను ఆహ్వానించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. నేషనల్ హైవేతో రైతుల భూములకు విలువ పెంచుతున్నారని, శాశ్వత తాగునీటి సమస్యకు చర్యలు చేపడుతున్నారన్నారు.
CTR: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం సంకటహర గణపతి వ్రతం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం సామూహికంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
సత్యసాయి: హిందూపురంలోని సబ్ జైల్‌ను సీనియర్ సివిల్ జడ్జి మానిపాటి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. ఆయన జైలులోని పరిసరాలను, నేరస్తుల గదులను, జైలులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నేరస్తులతో మాట్లాడుతూ.. క్షణికావేశంలో నేరాలు చేసి జైలుకు రావడం వల్ల మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు.
TPT: తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం సాయంత్రం కాణిపాకం లడ్డు పోటులో తనిఖీలు నిర్వహించారు. నెయ్యి నిల్వ, తయారీ విధానం గురించి ఆరా తీశారు. నెయ్యిని క్వాలిటీ టెస్టింగ్ కొరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ సెంటర్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు.
CTR: చిత్తూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శనివారం సాయంత్రం విడుదల చేసింది. రూరల్ మండలంలోని పెరుమాళ్ కండ్రిగ గ్రామ పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా మొలచి ఉన్న చిల్లచెట్లను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు.
TPT: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించిన ఖాళి టిన్లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టిన్లు 2025 మార్చి వరకు సేకరించవచ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు అక్టోబరు 3వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు అందజేయవలెను.
TPT: కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
VSP: విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల విభాగంలో సి.సి కెమేరాలను ఏర్పాటు చేయడం, ప్రవేశాలను క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు. సిబ్బంది, విద్యార్థులు తమ గుర్తింపు కార్డులు చూపించాలన్నారు.
CTR: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 28న రక్షాబంధనం, పవిత్ర ప్రతిష్ఠ, 29న స్నపన తిరుమంజనం, 30న హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి.