ATP: కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 8వ విడత సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం ఆర్ఎఫ్ విషయంలో ఉదారంగా స్పందిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.