WG: స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో నర్సాపురంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మడి నాయకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా శుభ్రతను కచ్చితంగా పాటించాలన్నారు.
కోనసీమ: గర్భిణిలు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతులైన బిడ్డలు పుడతారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమానికి సత్యానందరావు హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో వారికి ఆశీర్వాదం అందించారు.
SKLM: కోటబొమ్మాలి మండలం కిస్టుపురం ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ ప్రతాప్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తరిఫీది ఇవ్వాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న సామర్థ్యాన్ని చూసి సంతృప్తికరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
GNTR: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరడం ఖరారైంది. ఇందులో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. రాజకీయ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడంతో కిలారి రోశయ్యకు జనసేనలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
VZM: నెల్లిమర్ల ఎంఈవో విజయ్ కుమార్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఘనంగా సత్కరించారు. విజయనగరంలో నిర్వహించిన మహాకవి గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా నటుడిగా, కళాకారుడిగా సేవలందించిన విజయ్ కుమార్ మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితిచేతుల మీదుగా సత్కారం అందుకున్నారు.
VZM: పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మద్యాహ్న భోజన పథకాని అకస్మాత్తుగా పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి సహపంక్తిలో కూర్చుని ప్రార్ధన చేసి అనంతరం ఆహారాన్ని స్వీకరించారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా కడుకోవాలన్నారు.
KKD: కాకినాడ కలెక్టరేట్ వద్ద శనివారం కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2022లో అప్పటి ప్రభుత్వం కానిస్టేబుల్ భర్తీకి రాత పరీక్ష నిర్వహించిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో 95 వేలకు మందికి పైగా రాత పరీక్షలో అర్హత సాధించారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కానిస్టేబుల్ భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.
KKD: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం పెద్దాపురం నియోజకవర్గ కేంద్రంలోని జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రికి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు రామస్వామి బాబు ఘనస్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ వెళ్తూ… మధ్యలో జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ నేతలు జానకీ రామారావు, సరోజ్ వాసు, సాయిబాబు, యూత్ సభ్యులు ఉన్నారు.
KDP: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వేకువ జామున దర్శించుకున్నట్లు పట్టభద్రులు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించు కోవడం ఆనందకరంగా ఉందని వెల్లడించారు. తిరుమల లడ్డూపై వివాదంపై నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.
NLR : ఆత్మకూరు మండలంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ తెలిపారు. శనివారం ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్వైజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.
PLD: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం శనివారంతో ముగిసిందని పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో సార్ట్ యువర్ బిసినేస్ (SYB) అనే ప్రోగ్రాం ద్వారా నరసరావుపేట వాగ్దేవి కళాశాలలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉత్తమ జిల్లా స్థాయి సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అమలాపురం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎండి అలీముల్లా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
మన్యం: పార్వతీపురం ఐటిడిఎ ఇంఛార్జ్ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
VSP: యరాడ బీచ్లో విదేశీ పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ఇటలీ దేశానికి చెందిన 8మంది విదేశీయులను యారాడ సాగర్ తీరానికి చేరుకొని ఈత చేయ సాగారు. సముద్రపు అలలు వీరిని లోపలికి లాక్కెళ్లిపోవడంతో మిగిలి ఉన్న ఇటలీ దేశస్తులు అక్కడే ఉన్న స్థానికులకు కేకలు వేశారు. సముద్రంలో కోట్టుకుపోతుండగా లైఫ్ గార్డ్స్‌కు చెందిన సిబ్బంది అక్కడ ఉండడంతో వెంటనే వీరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.
అన్నమయ్య: యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టమైన పని కూడా విజయవంతం అవుతుందని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి అన్నారు. శనివారం రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా సులభం అవుతుందన్నారు.