• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24వ తేదీన విడుదల

ELR: రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24వ తేదీన విడుదల చేయబడుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు లో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు.

September 21, 2024 / 04:11 PM IST

సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాల వలన ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈ ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు.

September 21, 2024 / 04:09 PM IST

కరెంటు షాక్‌‌తో మహిళ మృతి.. గ్రామస్థుల నిరసన

W.G: వీరవాసరం మండలం వడ్డిగూడెంలో కూలి పనికి వెళ్లిన సూర్యకుమారి(33) అనే మహిళ విద్యుత్ షాక్‌‌తో మరణించింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు పాలకొల్లు- భీమవరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 21, 2024 / 04:08 PM IST

మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

మన్యం: పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర అన్నారు. పట్టణంలోని 7వ, వార్డ్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. ఇటివల విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి, అధికారులు బాధితులకు అహర్నిశలు కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి చేసిన సేవలను ప్రజలు గుర్తించారన్నారు. వందరోజుల్లో మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకొన్నారన్నారు.

September 21, 2024 / 04:07 PM IST

పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు

SKLM: జాతీయ అంధత్వ మరియు దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మండలం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ100 మందివిద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి ఎం ఆర్ కే దాస్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం వున్న 6 మందిని గుర్తించి ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు.

September 21, 2024 / 04:05 PM IST

రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం: నక్కా

BPT: కొల్లూరు మండలం క్రాపలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ‘మన మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.11లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని అన్నారు.

September 21, 2024 / 04:03 PM IST

‘రూపాయి అక్రమం చూపించినా జైలుకు వెళ్తా’

GNTR: గుంటూరులోని గ్రీన్స్ అపార్ట్మెంట్‌కు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ఖండించారు. అపార్ట్మెంట్‌కు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని, నిర్మాణంలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని చెప్పారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవే తప్ప, ఒక్క రూపాయి అక్రమాలు చూపిస్తే జైలుకు వెళ్తానని తెలిపారు.

September 21, 2024 / 04:03 PM IST

VIDEO: 100రోజుల్లో అనేక ప్రజా కార్యక్రమాలు చేశాం: ఎమ్మెల్యే బూర్ల

GNTR: కాకుమాను మండలం బికే పాలెం గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల్లో అనేక ప్రజా కార్యక్రమాలు చేశామన్నారు.

September 21, 2024 / 04:01 PM IST

ఎర్రావారిపాళ్యం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో శనివారం ఎర్రావారిపాళ్యం మండలం బోడేవాండ్లపల్లిలో కూటమి నాయకులు ‘మంచి ప్రభుత్వం కార్య క్రమం’ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రజలకు అందజేయనుందని వారు తెలిపారు.

September 21, 2024 / 04:01 PM IST

‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

TPT: తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం గ్రామ పంచాయితీ సచివాలయం-2లో శనివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్.ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఇందులో కూటమి ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు.

September 21, 2024 / 03:58 PM IST

మరోసారి స్పా సెంటర్‌పై దాడి

ఎన్టీఆర్: విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు.

September 21, 2024 / 03:58 PM IST

రేవంద్రపాడు వంతెనను పునర్నించండి

GNTR: రేవంద్రపాడు వద్ద బకింగ్ హోమ్ కెనాల్‌పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నించాలని నూతక్కి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రేవంద్రపాడు వంతెనపై నిత్యం వేలాదిమంది ప్రజలు, రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

September 21, 2024 / 03:57 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ

VZM: వేపాడ మండలం కొంపల్లి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి బాల భాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో చతుర్విధ ప్రక్రియలు చేయించి వారి అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించాలని కోరారు.

September 21, 2024 / 03:57 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు

TPT: గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు-2 అంగన్వాడి కేంద్రాల్లో శనివారం పౌష్టికాహారం మాస ఉత్సవాలు నిర్వహించారు. విందూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ పౌష్టికాహార మాసోత్సవాలను సూపర్వైజర్ హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి ఆమె వివరించారు.

September 21, 2024 / 03:57 PM IST

బ్రిడ్జి పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం

W.G: చాగల్లు గ్రామానికి చెందిన ఒక యువకుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యకి చాగల్లుకి చెందిన రఘుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

September 21, 2024 / 03:55 PM IST